Movies

అలనాటి నటీమణి కె ఆర్ విజయ ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా ?

ఒకప్పుడు దేవి పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన కె ఆర్ విజయ 1966లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన శ్రీకృష్ణ పాండవీయం మూవీలో నటించడం ద్వారా తెలుగు తెరపై మెరిసిన ఈమె అంతకు ముందే తమిళ, మలయాళ భాషల్లో నటించింది. కానీ శ్రీకష్ణ పాండవీయం మూవీలో రుక్మిణి పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈమె అప్పట్లో తెలుగులో వందకు పైగా సినిమాల్లో చేసింది.

తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మలయాళ నటుడు సుదర్శన్ వేలుయత్తర్ ని పెళ్లి చేసుకున్న కె ఆర్ విజయ అప్పట్లో తన భర్తకు పెళ్లి సమయానికి సొంత విమానం,కార్లు,పడవలు,హోటల్స్ ఉండేవని వివరించింది. తాము నలుగురు అక్కచెల్లెళ్లమని అయితే ఒకరు చనిపోగా, మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు నటనా రంగంలోనే ఉన్నారని చెప్పుకొచ్చింది. తన భర్త 60సినిమాలకు కూడా ఫైనాన్స్ చేసారని చెప్పారు.

ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకోవడం వలన గర్భం దాల్చినపుడు విమానంలో పుట్టింటికి వెళ్లగా,కొందరు ఫోటోలు తీసి, పత్రికల్లో వేశారని కె ఆర్ విజయ చెప్పుకొచ్చింది. అయితే ఇంట్లో వాళ్ళు సాదరంగా తన పెళ్లిని స్వాగతించి అక్కున చేర్చుకున్నారని చెప్పింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న ఈమె అన్ని భాషల్లో కల్పి 400పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కేరళలోని తన సొంత నివాసంలో ఉంటోంది.