Movies

ఒక్కడు సినిమాలో మహేష్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఒక్కడు మూవీ మహేష్ బాబుని సూపర్ స్టార్ ని చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లెలుగా నటించిన బేబీ నిహారిక ఎంతగానో ఆకట్టుకుంది. నిజానికి మోహన్ బాబు మేనకోడలు పాత్రలో యమజాతకుడు మూవీలో చేసింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.

దాంతో పెద్దగా సినిమాల ఛాన్స్ లు రాలేదు. అయితే ఒక్కడు మూవీ తర్వాత మంచి ఇమేజ్ వచ్చింది. ప్రేమించుకుందాం రా, వంటి చిత్రాలతో బాగా ఆకట్టుకుంది. కానీ ఆతర్వాత స్టడీస్ మీద దృష్టిపెట్టింది. చదువు పూర్తికావడంతో సినిమాలమీద దృష్టి పెట్టి,ఛాన్స్ ల కోసం చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు ఈమె లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.

ఇటీవల ఓ బాలీవుడ్ మూవీలో కూడా నిహారికకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా హీరోయిన్ ఛాన్స్ అని టాక్. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నవాళ్లు పెద్దయ్యాక మంచి ఛాన్స్ లు అందుకుంటున్నారు. అదేకోవలో ఈమె కూడా తన స్టామినా చూపించి,ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.