Health

మోనోపాజ్ సమయంలో మతిమరుపా… కొన్ని చిట్కాలు

ప్రతి స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే అతి క్లిష్టమైన దశ మోనోపాజ్ అని చెప్పవచ్చు. క్లిష్టమైన దశ అని ఎందుకు అంటామంటే, ఈ దశలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతాయి. అయితే మతిమరుపు అనేది చాలా మందిలో కనిపించే సాదారణ సమస్య. ఇవే కాకుండా మరికొన్ని మానసిక,శారీరక రుగ్మతలతో సతమతం అవుతారు. ఈ దశలో ఏర్పడే కొన్ని సమస్యలు మందులకు కూడా లొంగవు. అలాంటి వాటి కోసం కొన్ని పరిష్కారాల గురించి చర్చిద్దాము.

వ్యాయామం
మోనోపాజ్ సమయంలో శరీరంతో పాటు మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది. నడక,జాగింగ్,స్విమ్మింగ్ వంటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయటం ముఖ్యం. ఇవి శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా మెదడును కూడా చురుకుగా ఉంచుతుంది.

విశ్రాంతి
మోనోపాజ్ సమయంలో స్త్రీలు నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమయంలో వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మోనోపాజ్ కు దగ్గరగా ఉన్న మహిళలు ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్ర పోవాలి. గాడమైన నిద్రకు వ్యాయామం సహాయపడుతుంది. గాడ నిద్ర వలన హార్మోన్ల అసమానతలు తొలగుతాయి.

మెడిటేషన్
మోనోపాజ్ సమయంలో తలెత్తే మతిమరుపుకు మేడిటేషన్ మంచి మందుగా పనిచేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఓ గంట పాటు మేడిటేషన్ చేయుట వలన మంచి పలితాన్ని పొందవచ్చు.

పోషకాహారం
మానసిక,శారీరక ఆరోగ్యానికి పోషకాహారం చాలా అవసరం. ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న మహిళలు పోషకాహారం తీసుకోవటం వలన మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. బ్లూ బెర్రీ,చేపలు,సోయా వంటి ఆహారం తీసుకోవటం మంచిది.