పూరి జగన్నాథ్ జీవితంలో కష్టాలు పడటానికి అదే కారణమట

పూరి జగన్నాథ్ దర్శకుడిగా హిట్టు ఫ్లాపు అనే తేడా లేకుండా సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ తో ముందుకు వెళుతున్నాడు. పూరి పనైపోయిందా అన్న విమర్శలు వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ హిట్ తో ముందుకు వెళుతున్నాడు. గత సంవత్సరం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ రోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మనిషి నో చెప్పడం అలవాటు చేసుకోవాలని లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నాడు.

కొన్ని సందర్భాలలో ఇష్టం లేకపోయినా అవును అని చెబితే ఏరి కోరి కష్టాలు పడటం అవుతుందని అంటున్నాడు. మొహమాటంతో నో చెప్పటానికి ఇబ్బందిగా ఉంటే కాస్త సమయం కావాలని అడగండి. అవును అనుకుంటూ ముందుకు సాగితే సక్సెస్ సాధించలేమని, ఒక్కోసారి బాధ పడాల్సి వస్తుందని అంటున్నాడు.తన జీవితంలో నో చెప్పలేక అవును చెప్పడం వల్ల చాలా నష్టపోయా నని చెబుతున్నాడు పూరి జగన్నాథ్.