Movies

క్రేజ్ తగ్గుతున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా….షాక్ అవ్వాలసిందే

కొత్త నీరు వస్తే,పాత నీరు పోతుందనే సామెత ఉండనే ఉంది. ఇక టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. ఒకప్పుడు హీరో,హీరోయిన్స్ కాంబినేషన్స్ లో పాతిక సినిమాల వరకూ వచ్చేవి. ఇంకా ఎక్కువ సినిమాలు కూడా ఉన్నాయి. ఇపుడు నాలుగైదు సినిమాలు జంటగా నటిస్తే గొప్ప . మరోసినిమాకి కొత్త హీరోయిన్ కావాల్సిందే. అందుకే హీరోయిన్లుగా చెలామణి అవుతోన్న హీరోయిన్స్ లో కొందరు హిట్లు కొడ్తున్నా, కొందరు అవుట్ డేటెడ్ అయిపోతున్నారు. క్యూట్ గాళ్ కాజల్ టాలీవుడ్ ,కోలీవుడ్లో లీడింగ్ గాల్ గా రాణిస్తూ వచ్చింది. అయితే సరైన పాత్రలు దొరకక అవుట్ డేటెడ్ గా మారుతోంది.

అందుకే ఆమె కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. నయనతార ముందునుంచి కోలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తోంది.అప్పుడపు డు తెలుగులో ఒక సినిమా చేసినా నిర్మాతలకు బోల్డన్ని కండీషన్స్ పెట్టేస్తోందని టాక్. తమిళంలో విఘ్నేష్ గాళ్ గా హైలెట్ అవుతూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చేయడం వలన నయన్ కెరియర్ నడుస్తున్నా, కుర్ర హీరోలకు జోడీ కట్టలేకపోతోంది.

హ్యాపీ డేస్ తో సత్తా చాటి బాహుబలి వరకూ అగ్ర హీరోలందరి సరసన చేస్తూ వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ ప్రస్తుతం ఐటమ్ సాంగుల కు పరిమితం అయింది. కోలీవుడ్లోనే కలర్ ఫుల్ రోల్స్ చేస్తున్నా కూడా పెద్దగా రాణించడంలేదు అయితే నెగిటివ్ రోల్స్ చేస్తూ మహానటి అనిపించుకోవాలని ఉబలాటంగా ఉందట. దేవదాసు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఫారినర్ తో మ్యారీజ్ అని కొన్నిసార్లు,లివ్ అండ్ రిలేషన్ షిప్ అని ఇంకొన్నిసార్లు కబుర్లు చెప్పి వచ్చిన సినిమా ఛాన్స్ లు మిస్ చేసుకుంది..

ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. నటిగా మంచి పర్ఫార్మెన్ప్ పాత్రలే చేస్తున్నప్పటికీ నిత్యామీనన్ఎందుకనో ఆమె కెరియర్ వేగం తగ్గింది. హీరోలను ,దర్శకులను డామినేట్ చేసే విధంగా ఆమె బిహేవియర్ ఉంటుందనే టాక్ ఈమెకు గబా నెగెటివ్ అయింది. ఇక రెజీనా అయితే,…రకుల్ దెబ్బకు సెకండ్ హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది.ఆమె చేసిన సినిమాలన్నీ క్యూ కట్టి మరీ ఫ్లాప్ లవడంతో… ఆ సెంటిమెంట్ ఆమెకు ఛాన్స్ లు లేకుండా చేయడంతో కోలీవుడ్ కు తన మకాం మార్చినా పనవ్వడలేదు. హాట్ హాన్సిక టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లడమే కాదు, కోలీవుడ్ లో శింబుతో లవ్ స్టోరీ నడిపి, ఎక్కడలేని వ్యతిరేకత మూటగట్టుకుంది. దీంతో పూర్తిగా ఛాన్స్ లు తగ్గాయి.

బాపుగారి బొమ్మలా ఓ వెలుగు వెలుగుతుందని అంతా అనుకున్న ప్రణీతకు పవర్ స్టార్ సపోర్ట్ కూడా దొరకడంతో ఇక ఎదురులేదనుకున్నారు. కన్నడ చిత్రాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడమో,తెలుగులో ఛాన్స్ లు రాలేదో తెలీదు గానీ మొత్తానికి తెలుగు ఆడియన్స్ ని అలరించడంలో వెనుకబడింది. టాప్ చిత్రాలలో తళుక్కుమంటూ హైలెట్ అవుతున్న ప్పటికి మెహ్రీన్ అనుకున్న రేంజ్ రాలేదు. నానితో చేసిన క్రిష్ణగాడి వీరప్రేమ గాధ,రవితేజ రాజాదిగ్రేట్,వరుణ్ తో చేసిన ఎఫ్ 2 మూవీస్ హిట్ అయినా వచ్చిన క్రెడిట్ ఆయా హీరోలే ఎగరేసుకుపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు లేదు.

ఇక తెలుగులోనే కాదు సౌత్ లో అనుష్క,శ్రుతి హాసన్ ,రకుల్ టాప్ హీరోయిన్స్ గా ఉంటున్నారు. అయితే కొత్తవాళ్లు రావడంతో పోటీ నెలకొంది. దీంతో ఏజ్ బార్ బ్యూటీస్ గా మారిపోవడంతో సీనియర్ హీరోలకు తప్ప కుర్రహీరో లు వీళ్ళను ఒప్పుకోవడం లేదట. టాలీవుడ్లో ఎట్ ప్రజెంట్ లీడింగ్ గాళ్స్ గా ఉన్న రాశి ఖన్నా ,నివేద థామస్ లు పెద్ద మూవీస్ చేస్తున్నప్పటికీ రావల్సిన ఇమేజ్, దక్కడం లేదు. మరి తేడా ఎక్కడ జరిగిందో గానీ ఇప్పుడొస్తున్న తారల ముందు వెలవెల బోతున్నారు.