Movies

అభిలాష సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా….వెంటనే చూసేయండి

సమిష్టి విజయంతో అభిలాష మూవీ హిట్ అయిందని డైరెక్టర్ కోందండ రామిరెడ్డి తరచూ గుర్తుచేసుకుంటూ ఉంటారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ తొలిసినిమాతోనే రెపరెపలాడింది. చిరు ఇమేజ్ పదిలం. సామాన్యులకు అర్ధమయ్యేలా తీసినందుకు కోదండ రామిరెడ్డికి అందరి నుంచి ప్రశంసలు. ఈ మూవీ విశేషాల్లోకి వెళ్తే, .. ఓపక్క చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్నాడు. మరోపక్క రేడియో ద్వారా జీవితం ప్రారంభించి క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్ పెట్టి తమిళ చిత్రం మౌన గీతంగా అనువదించి వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఎర్ర గులాబీలు,టిక్ టిక్ టిక్ మూవీస్ కూడా అనువదించారు. చిరుతో సంబంధం ఉండడం వలన తొలిచిత్రం అతనితోనే తీయాలని భావించి, విషయం చెప్పి ఓ నవల చిరు చేతిలో పెట్టారు. నవల చదవడం ఇష్టంలేని చిరు ఆ నవల అటూ ఇటూ తిప్పేసరికి అభిలాష,యండమూరి వీరేంద్రనాధ్ అని వుంది. వెంటనే ఒకరోజు తన తల్లి ఆ నవల వారపత్రికలో చదువుతూ ఉండడం, ఇది సినిమాగా తీస్తే ఒప్పుకో అని చెప్పడం గుర్తొచ్చాయి. వెంటనే ఒకే చెప్పేసాడు. న్యాయం కావాలి, కిరాయి రౌడీలు వంటి మూవీస్ చేసిన ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో అభిలాష మూవీకి కెఎస్ రామారావు సన్నద్ధం అయ్యారు.

అప్పటివరకూ డబ్బింగ్ మూవీ చేసిన కె ఎస్ 1982 విజయదశమి నాడు తెలుగులో స్ట్రైట్ మూవీ అభిలాష స్టార్ట్ చేసారు. 1981,82లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అభిలాష సీరియల్ వచ్చి బాగా పాపులర్ అయింది. అందులో హీరో పాత్ర పేరు చిరంజీవి. కేవలం చిరంజీవిని దృష్టిలో ఉంచుకుని ఆ పాత్ర క్రియేట్ చేశానని యండమూరి చెప్పుకొచ్చారు. ఆంగ్లంలో వచ్చిన బియాండ్ ఏ రీజనబుల్ డౌట్ అనే సినిమా ఆధారంగా అభిలాష నవల వచ్చింది. ఇక కోదండ రామిరెడ్డి భార్యకు కూడా ఈ నవల చాలా ఇష్టం. దాన్నే సినిమా తీస్తున్నారని తెలిసి ఆమె సంబరపడ్డారు. ఇలా యండమూరి ,చిరంజీవి,కె ఎస్ ,కొండరామిరెడ్డి కాంబోలో వచ్చిన తొలి సినిమా ఇది. నవలలో హీరోపేరు చిరంజీవి కనుక అలానే ఉంచేశారు. తర్వాత ఛాలెంజ్ ,రాక్షసుడు,మరణమృదంగం వంటి మూవీస్ ఈ కాంబోలో వచ్చాయి. అభిలాషకు సత్యానంద్,సత్యమూర్తి స్క్రీన్ ప్లే సిద్ధం చేసారు. వైజాగ్ లో షూటింగ్ చేసారు. నవలను యధాతధంగా తీయడం వలన యండమూరి, సత్యమూర్తిని తన పక్కనే ఉండి గైడ్ చేయాలని కోదండ రామిరెడ్డి కోరారు.

వైజాగ్ జైలులోనే 20రోజుల షూటింగ్. ఖైదీలే వండిపెట్టేవారట. జైళ్ల శాఖ ఐజి ఎం ఆర్ అహ్మద్ అప్పుడు జైలు సూపరింటెండెంట్ గా ఉండడంతో ఆఖరిరోజున యూనిట్ కి పార్టీ ఇచ్చారట. వైజాగ్ లో 25రోజులు,చెన్నైలో 15రోజులు షూటింగ్ . మద్రాసులో హాస్పిటల్ సెట్స్ వేశారు. డిస్కో సాంగ్, కోర్టు సీన్స్ అన్నీ కూడా అక్కడే తీశారు. సందెపొద్దుల కాడ సాంగ్ మినహా పూర్తయింది. అయితే ఎవరికీ వాళ్ళు షూటింగ్స్ లో బిజీ కావడం వలన ఒకరోజు కేటాయించడంతో ఊటీలో ఒక్కరోజులో సాంగ్ షూట్ చేసేసారు. ఇక వైజాగ్ లో షూటింగ్ సమయంలో రోజూ ఓ కుర్రాడు ఎంసెట్ కోచింగ్ పేరుతొ అబ్జర్వ్ చేయడానికి వచ్చేవాడు. అతడే పూరి జగన్నాధ్.1983 మార్చి11న సినిమా రిలీజ్. సూపర్ హిట్ టాక్. ఇళయరాజా మ్యూజిక్ తెలుగులో బాగా కనెక్ట్ అయింది. యురేకా సకా మీకా సాంగ్ అయితే కుర్రకారుని ఊపేసింది. ఉరిశిక్ష రద్దు కోసం పోరాడే యువ న్యాయవాదిగా చిరు రాణించాడు. వాళ్ళమ్మ గారు చెప్పిన కేరక్టరైజేషన్ ఊహించుకుని చేసారు. చిరు టాప్ టెన్ మూవీస్ లో అభిలాష ఉండితీరుతుంది.