Devotional

తాళి గురించి ఎవరికి తెలియని రహస్యాలు

తెలుగులో తాళి, సంస్కృతంలో మంగళం. రెండూ కలిస్తే సూత్రం. అయితే పూర్వకాలంలో ధరించే మంగళసూత్రాన్ని తాళి అంటారు అని…ఇప్పుడు ధరించే తాళి మంగళసూత్రం కాదని అంటుంటారు. అలాంటి మంగళ సూత్రంలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి.

మంగళసూత్రం సాధారణంగా మూడుపోగుల దారం, మూడు వరుసలు కలుపుతారు. అలా తొమ్మిది. తొమ్మిది పోగుల్ని మూడు వరుసలు ఇలా ఇరవై ఏడు పోగులు అవుతుంది.అలా స్త్రీ మెడలో వేసుకొనే దారం పోగులు ఇరవై ఏడు. ఇరవై ఏడు పోగుల దారానికి రెండు బిళ్లలు . ఆ బిళ్లల్లో ఒక బిళ్లని తల్లిగారు, మరో బిళ్లని అత్తగారు అని పిలుస్తాం. అంతేకాదు ఆ బిళ్లల్లో లక్ష్మీ దేవీ, సరస్వతి దేవీ కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

మెడలో ఉన్న రెండు బిళ్లలు రెండు సున్నాలు ఒకటి భార్య, రెండోది భర్త. తాళిని తాళిమి గా కొలుస్తారు. తాళిమి అంటే ఓర్పు ఎన్ని కష్టాలు వచ్చిన కుటుంబాన్ని తన సంరక్షణలో జాగ్రత్తగా చూసుకుంటుంది భార్య. అందుకే భార్యను భరించేది అంటుంటారు మన పెద్దలు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."