Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా ?

సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్లకు కొంచెం వయసు పెరిగాక లీడ్ రోల్స్ ఆటోమేటిగ్గా తగ్గిపోతాయి. అక్క వదిన , అత్త, తల్లి పాత్రలు కూడా వస్తాయి. ఇది ఇప్పుడు కాదు గతం నుంచీ జరుగుతున్న తతంగమే. లవకుశలో ఎన్టీఆర్ పక్కన సీతగా మెప్పించిన అంజలీదేవి ఆతర్వాత కాలంలో ఎన్టీఆర్ కి తల్లి పాత్రలు వేసింది. కానీ కొందరు ఇలా వేయడానికి ససేమిరా అంటారు. తాజాగా ఓ నటి కూడా ఇలానే ఫీలయిందట. అంతేకాదు, త్రిష, నయనతార లతో కల్సి సినీ ఇండస్ట్రీకి వచ్చామని, అందరం హీరోయిన్స్ గానే నటించామని అలాంటప్పుడు తనను మాత్రం అమ్మ పాత్రల్లో ఎలా అడుగుతున్నారని దర్శక నిర్మాతల ను దులిపేస్తోందట.

దర్శకుడు సెల్వ రాఘవన్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయిన సదరు హీరోయిన్ కొన్నేళ్లకే అతడి నుంచి విడిపోయింది. ఐతే అప్పటికే ఆమెను అందరూ మరిచిపోయారు. హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గాయి. తర్వాత గట్టిగా ప్రయత్నిస్తే సైడ్ క్యారెక్టర్లు మాత్రమే లభించాయి. తెలుగులో ‘టెంపర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని కాలర్ పట్టుకుని క్లైమాక్స్ లో కొట్టే సన్నివేశం లాంటి చిన్న చిన్న పాత్రలను మరికొన్ని సినిమాల్లో చేసింది. తమిళంలోనూ ఇలాంటి రోల్సే చేస్తోంది. ఐతే తాను ఇప్పటికీ అందంగానే హీరోయిన్ గా నటించేందుకు తగిన ఫిట్నెస్ తోనే ఉన్నానని.. ఇప్పట్లో తల్లి పాత్రల్లో నటించనని అంటోంది.

రాధిక, ఖుష్బూల మాదిరి తనకు వయస్సు పెరిగిన తర్వాత అమ్మ పాత్రల్లో నటిస్తానని ప్రస్తుతం అమ్మ పాత్రల లో నటించే వయస్సు రాలేదని ఆమె తేల్చి చెప్పింది.ఇంతకీ ఆమె ఎవరంటే .. ‘7/జి బృందావన కాలనీ’ సహా కొన్ని సినిమాలతో తమిళ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సోనియా అగర్వాల్. తనకింకా తల్లి పాత్రలు పోషించే వయసు రాలేదని.. కానీ ఈ లోపే తనకు మదర్ క్యారెక్టర్లు ఆఫర్ చేయడం ఏంటని సోనియా అగర్వాల్ సీరియస్ అయిందట. హీరోయిన్ గా మంచి ఫాంలో ఉండగానే ‘7/జి బృందావన కాలనీ’ డైరెక్టర్ నే పెళ్ళాడి,తర్వాత విడిపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."