మెగా మేనల్లుడి పెళ్ళి ఫిక్స్….అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
పెళ్లికాని హీరోలంతా కరోనా సమయంలోనే పెళ్లిపీటలెక్కారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. నిఖిల్, నితిన్ వంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటున్నారు. దగ్గుబాటి రానా కూడా ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారికకు కూడా నిశ్చితార్ధం తంతు పూర్తయింది.
అయితే మొన్నటిదాకా పెళ్లి ఊసెత్తితే ఇప్పుడేం కాదు అంటూ తప్పించుకుంటూ వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లొచ్చినా కక్కొచ్చినా ఆగదన్న నానుడికి అనుగుణంగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు టాక్. ప్రస్తుతం 32ఏళ్ళు పూర్తయి .. ‘సోలో బతుకే సో బెటర్’ అనే మూవీ చేస్తున్న తేజ్ అందుకు భిన్నంగా పెళ్ళికి ఒకే చెప్పాడని అంటున్నారు.
లవ్ మేరేజ్ కాకుండా ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు, అదికూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన తమ దగ్గరి బంధువుల అమ్మాయి అని వినిపిస్తోంది. ఇప్పటికే అమ్మాయిని తేజ్ తల్లి చూడడం .. మేనమామ మెగాస్టార్ చిరంజీవి దృష్టి లో పెట్టడం, దీనికి చిరంజీవి కూడా ఒకే చెప్పడం జరిగిందట. అయితే ప్రస్తుతం సరైన ముహుర్తం కారణంగా 2021 సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరిగే ఛాన్స్ ఉందట.