Movies

శ్రీముఖి తన యాంకరింగ్ తో అనసూయ, రష్మీలకి చెక్ పెట్టగలదా…?

ఈ ఏడాది ఓహ్ ఉమానియా షో తో యూట్యూబ్ లో పాపులర్ గా మారిన యాంకర్ శ్రీముఖి జి తెలుగులో ప్రసారమవుతున్న అదిరింది షో లో యాంకర్ గా చేస్తోంది. నిజానికి హాట్ గా కన్నా కామెడీ పండించడంలో ఈమె దిట్ట గా పేరుపొందింది. అందుకే మాటలతో ఎక్కువ హంగామా సృష్టిస్తూ ఉంటుంది. జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వచ్చాక జి తెలుగులో అదే కామెడీతో అదిరింది షో పెట్టినా క్లిక్ కాలేదు.

దీంతో యాంకర్ ని చేంజ్ చేసి, శ్రీముఖిని పెట్టుకున్నారు. షో పేరు కూడా బొమ్మ అదిరింది అని కూడా మార్చారు. అయినా సరే, జబర్దస్త్ రేటింగ్స్ ని అందుకోవడంలో అదిరింది షో విఫలమయింది. నిజానికి నాగబాబు,సుమ, జానీ మాస్టర్ లు గెస్టులుగా శ్రీముఖి యాంకరింగ్ తో ఆదివారం జరిగిన బొమ్మ అదిరింది షో కొంచెం ఒకే అనిపించేలా ఉంది.

అయితే యాంకర్ రేష్మి, అనసూయలకు చెక్ పెట్టె రీతిలో శ్రీముఖి చేస్తుందా అనేది అనుమానమే. నిజానికి వీళ్లిద్దరి పాపులార్టీ ముందు శ్రీముఖి వెలవెలబోతోందని విశ్లేషకుల అంచనా. ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనీ అంటున్నారు. నిజానికి రేష్మీకి తెలుగు పెద్దగా రాకున్నా సరే, తన గ్లామర్ తో బాగా మానేజ్ చేస్తూ, జబర్దస్త్ ని రక్తి కట్టిస్తోంది. ఇక సినిమా ఛాన్స్ లు కూడా రేష్మి,అనసూయలు బాగానే దక్కించుకుంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."