డైరెక్టర్ గా సినిమా చూపిస్తానంటున్న హీరో… సక్సెస్ అవుతాడా…?
డాక్టర్ అవ్వకపోయి యాక్టర్ అయ్యానని, హీరో అవ్వాలని వచ్చి ప్రొడ్యూసర్ గా మారానని, డైరెక్టర్ గా అవ్వాలని వచ్చి అనుకోకుండా హీరో అయ్యానని ఇలా మన స్టార్ హీరోలు చెప్పడం తెల్సిందే. అయితే ఉయ్యాలా జంపాల మూవీతో మంచి హిట్ కొట్టేసిన కుర్ర హీరో రాజ్ తరుణ్ ఆతర్వాత సినిమా చూపిస్తా మావా , కుమారి 21ఎఫ్, అంధగాడు వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
అయితే ఈమధ్య పెద్దగా హిట్స్ కూడా పడకపోవడంతో పాటు ఈ మధ్య ఓటిటిలో రిలీజైన ఒరేయ్ బుజ్జిగా మూవీ కూడా ఆకట్టుకోలేదు. దీంతో అసలే కరోనా కాలం కావడంతో అసలు తనేమనుకుని ఇండస్ట్రీకి వచ్చాడో ఆ పని చేయాలనీ రాజ్ తరుణ్ భావిస్తున్నాడట.
ఇంతకీ రాజ్ తరుణ్ డైరెక్టర్ అవ్వాలని ఉందట. ఓ టివి ప్రోగ్రాం ఇంటర్యూలో ఈ విషయం చెప్పాడు. ఛాన్స్ వస్తే డైరెక్టర్ అవ్వాలని ఉందని, అది కూడా సునీల్ ని డైరెక్ట్ చేయాలనుందని వివరించాడు. సునీల్ కోసం ఓ కథ కూడా రెడీ చేసినట్లు టాక్. మరి రాజ్ తరుణ్ డైరెక్షన్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.

