మన హీరోల ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే ?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అన్ని ఇండస్ట్రీలో వారసత్వంతో పాటు కేరాఫ్ ఎడ్రెస్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సత్తా చాటి స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, టాలెంట్ లో లోపం, ఇతరతరా కారణాల వలన తేడా కొట్టడం వలన మధ్యలోనే ఇండస్ట్రీ నుంచి దూరమయిన వాళ్ళూ ఉన్నారు. అయితే హీరోగా స్టేటస్, స్టార్ డమ్ వచ్చాక యాడ్స్ కూడా చేస్తూ, రెండు చేతులా సంపాదిస్తూ వేరే రంగాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లకు పడగలెత్తినవాళ్లున్నారు. అందాల నటుడు శోభన్ బాబు ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టి ఆరోజుల్లోనే ఎక్కువ సంపాదన గల హీరోగా ఎదిగాడు.
ఇక శోభన్ బాబు సలహా మేరకు మురళీమోహన్, చంద్రమోహన్ లాంటి వాళ్ళు కూడా ల్యాండ్ మీద పెట్టుబడులు పెట్టి బాగానే వెనకేసుకున్నారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, రామానాయుడు లాంటి వాళ్ళు స్టూడియోలు కట్టారు. అలాగే బిజినెస్, ప్రొడక్షన్ హౌస్, ఇలా ఎన్నో రకాలుగా హీరోలు సినిమా రంగంలోనే కాకుండా, మిగిలిన రంగాల్లో స్టార్ హీరోలు ,హీరోయిన్స్ కూడా పెట్టుబడులు పెడ్తుంటారు. రెమ్యునరేషన్స్ కూడా పెంచుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు (జిఎంబి ఎంటర్టైన్మెంట్స్), రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ) ఇతర వ్యాపారాలు మాత్రమే కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు.
నాగార్జున కూడా ఇతర వ్యాపారాలతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. దాంతో వాళ్ళ ఆదాయం చూస్తే భారీగానే ఉంటోంది. ప్రస్తుతం నాగార్జున 3000 కోట్లు ప్రాపర్టీ సంపాదించినట్లు టాక్. ఇక ఉపాసనను చేసుకున్నాక రామ్ చరణ్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వలన 2800 కోట్లు ఆస్తులు కూడబెట్టినట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవి 1500 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ 1000 కోట్లు, బాలకృష్ణ 800 కోట్లు, అల్లు అర్జున్ 350 కోట్లు, ప్రభాస్ 200 కోట్లు, మహేష్ బాబు 150 కోట్లు ఆస్తులు కలిగి ఉన్నట్లు టాక్.