బిగ్ బాస్ కారణంగా వీరికి కలిగిన బెనిఫిట్స్ ఏమిటో తెలుసా ?
హిందీలో బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ రావడంతో తెలుగులో కూడా స్టార్ మా యాజమాన్యం ప్రారంభించి ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తిచేసింది. నాల్గవ సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా 16మంది కంటెస్టెంట్స్ తో పక్కా కరోనా నిబంధనలతో స్టార్ట్ అయి , కొనసాగుతోంది. అయితే ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ కి పెద్ద గా ఏమీ ఒరిగిందేమీ లేదని తెలుస్తోంది. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసాడు. విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. కానీ ఈ షో విజయం తర్వాత ఆతనికి కొత్తగా ఛాన్సులు ఏమీ రాలేదు. అప్పట్లో 70రోజులపాటు సాగిన షో లో నవదీప్, కత్తి మహేష్, సమీర్,ముమైత్ ఖాన్, సింగర్ మధుప్రియ,సంపూర్ణేష్ బాబు, ప్రిన్స్ ,కార్తీక, సింగర్ కల్పనా ,ఆదర్శ్ ,ధనరాజ్ ,దీక్ష పాల్గొన్నారు. అప్పటికే హీరోగా శివబాలాజీ కి మంచి పేరుంది. కానీ షో లో విజేతగా నిల్చిన తర్వాత కొత్తగా ఛాన్స్ లు కాదు కదా, ఉన్న ఛాన్స్ లే రాకుండా పోయాయని టాక్. మిగిలిన కంటెస్టెంట్స్ కి కూడా బిగ్ బాస్ షో పెద్దగా కల్సి రాలేదు.హరితేజ ఒక్కర్తే తరచూ సినిమాల్లో కనిపిస్తోంది.
ఇక నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన సీజన్ 2లో కౌశల్, భానుశ్రీ, తనీష్, బాబు గోగినేని, రోల్ రైడా, దీప్తి సునయన, కీర్తి, శ్యామల, తేజస్వి, గణేష్, సంజన, నందిని,నూతన నాయుడు కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. తేజస్వి కి ఉండే ఇమేజ్ మొత్తం ఈ షో తర్వాత రివర్స్ అయింది. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ కి ఎవరికీ ఒరిగిందేమీలేదు. ఇక విన్నర్ గా నిల్చిన కౌశల్ పేరు మారుమోగిపోగా, షో అయ్యాక పత్తాలేకుండా పోయాడు. ఇదిగో సినిమా,అదిగో సినిమా అంటూ పుకార్లు షికారు చేసాయి. కానీ రిబ్బన్ కటింగ్ లకు మాత్రమే కౌశల్ పరిమితమయ్యాడు. ఇక మూడవ సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసాడు. రాహుల్,యాంకర్ శ్రీముఖి, శివజ్యోతి, టివి నటుడు రవి కృష్ణ, జర్నలిస్ట్ జాఫర్ ,నటి హిమజ, అషు రెడ్డి, గీతా మాధురి,రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, రవి, హీరో వరుణ్ సందేశ్ ,వితిక, శిల్పా చక్రవర్తి కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.
రాహుల్ విజేతగా నిల్చి, బెంజి కారు కొనేదాకా ఆర్ధిక పరిస్థితి మారింది తప్ప కేరీర్ పరంగా అద్భుతాలు మాత్రం జరగలేదు. రన్నరప్ గా వచ్చిన శ్రీముఖి కూడా అప్పటికే స్టార్ యాంకర్. కానీ బిగ్ బాస్ తర్వాత కొత్తగా ఏమీ రాలేదు. శివజ్యోతి సొంతింటి కల నిజం చేసుకున్నా కెరీర్ లో ఏమాత్రం చేంజ్ లేదు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ తో ముందుకెళ్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్ కి ఏమాత్రం మార్పు రాలేదు. బిగ్ బాస్ వలన పేరు వచ్చిందే తప్ప ,కెరీర్ లో ఎవరికీ బ్రేక్ రాలేదని సినీ వర్గాల మాట. మొత్తం మీద బిగ్ బాస్ వలన ఒరిగిందేమీ లేదన్నది టాక్. ఇక సీజన్ 4కి కూడా హోస్ట్ గా నాగ్ ఉన్నాడు. ఇందులో పెద్దగా పేరున్న వాళ్ళెవరూ లేరని ముందే టాక్ నడుస్తోంది.