Movies

ఈ బాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి

సినిమా రంగంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉంటూ.. విభిన్న తరహా పోస్టులతో దూసుకెళుతున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకూ హీరోల రేంజ్ సోషల్ మీడియాలో అదిరిపోతోంది. వాళ్ళు పెట్టె పోస్టులకు వచ్చే స్పందన, కామెంట్స్, లైక్ లు లక్షలు,మిలియన్స్ దాటిపోతున్నాయి.

ఇక బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి ఇమేజ్ తెచ్చేసుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇంస్టాగ్రామ్ లో టైగర్ కు 26మిలియన్ల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా పరంగా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్ తోనే ఛాన్స్ లు అందిపుచ్చుకుని సత్తా చాటుతున్నాడు.

అయితే టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ 3మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో కథల సెలక్షన్ లో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇక కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటున్న టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో స్పీడ్ గా ఉంటున్నాడు. తాజాగా బాక్సింగ్ బ్లౌజ్ తో జిమ్ లో చేస్తున్న ప్రాక్టీస్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, 10లక్షల లైక్ లు వచ్చేసాయి. ఈ ఫోటో చూస్తుంటే తదుపరి మూవీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్నాడని అనిపిస్తోంది.