శుక్రవారం ఈ వ్రతం చేసి సకల సంతోషాలను పొందవచ్చు

దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది. ఈ పూజ చేసి సకల సంతోషాలను పొందవచ్చు. ఈ పూజ ఎప్పుడు ఎలా చెయ్యాలో తెలుసుకుందాం…

ఈ పూజను శ్రావణమాసం లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

ఇలా 16 వారాలపాటు చేస్తే ఎంతో మంచి, మనశ్శాంతి కలుగుతుంది.

error: Content is protected !!