మెగాస్టార్ కోసం ,బాలయ్య కోసం ట్రై చేసిన పూరి ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడో ?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇండస్ట్రీలో ఎందరో హీరోలకు హిట్స్ ఇచ్చాడు. మహేష్ బాబుకి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అయితే చాలా కాలం నుంచి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని పూరి కోరుకుంటున్నాడు. అందుకోసం కథ కూడా వినిపించాడు. కొన్ని కారణాల వల్ల వీరి కాంబో మూవీ సెట్ అవ్వలేదు. అయితే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మూవీ చిరుత డైరెక్షన్ చేసింది పూరీయే. ఇక ఇక బాలకృష్ణ తో పైసా వసూల్ మూవీ తీసిన పూరి తాజాగా మరో సినిమా బాలయ్యతో తీసేందుకు డేట్లు తీసుకున్నట్లు టాక్.

ఇక మరో సారి చిరంజీవితో సినిమాకు పూరి జగన్నాధ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే చిరంజీవి, బాలకృష్ణల్లో మొదట ఈయన ఎవరితో మూవీ చేస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో అనూహ్యంగా నాగార్జునతో మూవీ చేయడానికి పూరి రెడీ అన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. . నాగార్జున కోసం ఒక ఫాంటసీ కథను పూరి రెడీ చేశాడని అంటున్నారు. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన శివమణి ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరికి ఉన్న కమిట్ మెంట్స్ ఒకే అయితే, సినిమా సెట్స్ మీదికి త్వరలో రాగలదని అంటున్నారు.

పూరి జగన్నాధ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీగా ఫైటర్ మూవీని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నప్పటికీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే విడుదలకు రెడీ అవ్వాల్సిన సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వలన తదుపరి సినిమాలపై కసరత్తు చేస్తున్నాడు. నిజానికి కొన్నాళ్లుగా హిట్స్ లేకపోవడంతో ఇబ్బందుల్లో పడిన పూరి ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అందుకే స్టార్ హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ కోసం ,బాలయ్య కోసం ట్రై చేసిన పూరి ఇప్పుడు నాగ్ కి కనెక్ట్ అవ్వడం కూడా మంచిదేనని అంటున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఈలోగా మెగాస్టార్ గానీ, బాలయ్య గానీ డేట్స్ ఇచ్చేస్తే ఏమి చేస్తాడో చూడాలి.