Movies

జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

జగపతి బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ లో యాంగ్ రొమాంటిక్ హీరో. అప్పట్లో శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రుల అందగాడు జగపతి బాబు. జగపతి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేదు. చదువు అంటే అసలు పడదంట. ఏదైనా నచ్చకపోతే దాని జోలికే పోడు. తండ్రి నిర్మాత కావటంతో కెరీర్ ప్రారంభంలో సొంత బేనర్ లో సినిమాలు చేసాడు.

అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవటం వలన కొంత ఆస్థి పోవటమే కాకుండా కొంత నిరాశకు కూడా గురి అయ్యాడు. ఆ తర్వాత మరల ట్రై చేసి కొన్ని హిట్స్ అందుకొని బాగా సంపాదించినప్పటికీ జల్సారాయుడు కావటం, జూదాలు ఆడటం మరియు అడిగిన వారికీ కాదని అనకుండా డబ్బులు ఇవ్వటం అవి తిరిగి రాకపోవటం….ఇలా ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు చేయటం, అతిగా దానాలు చేయటం వలన ఉన్న ఆస్తిని నిలబెట్టుకోలేకపోయాడు.

ఆలా ఆర్ధికంగా చాలా వెనకపడ్డాడు. ఆ తర్వాత విలన్ గా మారాలని అనుకున్నాడు. దాంతో అనుకోకుండా ఒక అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అది లెజెండ్ సినిమాలో విలన్ గా చేయటం. ఇక అక్కడినుంచి వరుసగా విలన్ గా సినిమాలు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడ్డాడు. ఇప్పటివరకు జగపతికి సొంత ఇల్లు కూడా లేదట. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత వెనకేసుకుంటున్నా…. అని అంటున్నాడు జగపతి.