Movies

శోభన్ బాబు సినిమాలు మానేయడానికి అసలు కారణం ఇదేనా ?

Shobhan babu stopped acting :శోభన్ బాబు అమ్మాయిల కలల రాకుమారుడిగా టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను ముఖ్యంగా మహిళ కుటుంబ అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికీ టీవీలో శోభన్ బాబు సినిమా వస్తే టీవీ కి అతుక్కుపోయి చూసే అభిమానులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు సినిమాల్లో నటించక పోవటానికి కారణం చెప్పుకొచ్చారు. శోభన్ బాబు అభిమానుల మనసుల్లో అందగాడు గా ముద్ర ఉండాలని అందుకే ఒక వయసు వచ్చాక సినిమాలకు దూరం అయ్యారని చెప్పారు.

మంచి సినీ అవకాశాలు ఉన్న సమయంలోనే తనకు తానుగా సినిమాలకు దూరమయ్యారు. శోభన్ బాబు తన వారసులను ఎవరిని సినీ పరిశ్రమకు తీసుకురాలేదు. సినీ పరిశ్రమకు దూరంగా ఉంచి మంచి చదువులు చెప్పించారు శోభన్ బాబు సంపాదించిన వందల ఎకరాలు స్థలాలు ఇప్పటి విలువ చూసుకుంటే కొన్ని వందల కోట్లు ఉంటాయని సినీ వర్గాలు అనుకుంటూ ఉంటాయి. ఒకానొక సమయంలో శోభన్ బాబు ఇండియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరుపొందాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."