కార్తీక మాసంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో చూడండి
పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో… దానాలు చేయడం వల్ల కూడా అంతే పాప పరిహారం. అందుకే ఈ మాసంలో శక్తి కొలదీ దానధర్మాలు చేయాలని శాస్త్రాలు చెపుతున్నాయి. సాధ్యపడేది ఒక్కటైనా చెయ్యమని సూచిస్తున్నాయి. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది.
1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషాలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్రలేమి ఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానం కలుగుతుంది.
9. ఉసిరికాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. కొబ్బరికాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది.