Movies

ఈ విలన్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Tollywood villains remuneration :సినిమాలో హీరో పాత్ర ఎంత బలంగా ఉంటుందో విలన్ పాత్ర కూడా అంతే బలంగా ఉంటుంది అలా ఉంటేనే సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది దాంతో విలన్ పాత్ర చేయడానికి హీరో స్థాయికి తగ్గ వ్యక్తులే ఇప్పుడు నటిస్తున్నారు ఈ క్రమంలో దర్శకనిర్మాతలు విలన్ పాత్ర కోసం భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలో చూసుకుంటే బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ విలన్స్ కి ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్రేజీ విలన్స్ పారితోషికం ఎలా ఉందో చూద్దాం.

జగపతిబాబు విషయానికొస్తే స్టార్ హీరోగా ఉండేవాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా నటించడానికి రెండు నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజు అయితే తను ఏ పాత్ర చేసినా విలన్ పాత్ర లేదా పాజిటివ్ పాత్ర ఏ పాత్ర అయినా సినిమాకు దాదాపు 2 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తారు.

కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేసిన సోను సూద్ ఒక్క రోజుకి 20 లక్షల పారితోషికం తీసుకుంటారు. ఉప్పెన సినిమా లో నటించిన తమిళ హీరో విజయ్ సేతుపతి నాలుగు కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు