ఆహా బన్నీ యాడ్ కి డైరెక్టర్ ఎవరో తెలుసా ?

allu arjun aha ad :తెలుగులో అల్లు అరవింద్ ప్రారంభించినా ఆహా OTT ప్లాట్ ఫామ్ కి ఇప్పటివరకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు అల్లుఅర్జున్ రంగంలో దిగి ఒక యాడ్ చేసి సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. ఈ యాడ్ కి మంచి స్పందన వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న లవర్‌ ను కలిసేందుకు వెళ్లే బన్నీ వాళ్ల నాన్న మరియు అన్నయ్య రావడంతో బయట రాత్రి అంతా కూడా కూర్చోవల్సి వస్తుంది.రాత్రి అంతా ఎలా కూర్చున్నావ్‌ బేబీ అంటూ ఆమె ప్రశ్నించగా ఆహా చూసుకుంటూ కూర్చున్నాను అంటాడు.

ఈ యాడ్ చాలా విభిన్నంగా ఉండి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది ఇప్పుడు ఈ యాడ్ కి డైరెక్షన్ ఎవరు అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ యాడ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేశాడట. .అది కూడా అల వైకుంఠపురం సినిమా షూటింగ్‌ సమయంలోనే చేశారట.