Devotional

కార్తీక మాసం లోనే పెళ్లిళ్లు.. ఈనెల తప్పితే మరో…

కార్తీకమాసం అనగానే మనకు వనభోజనాలు శివుని పూజ శివ అభిషేకాలు ఉపవాసాలు ఇలా అన్ని గుర్తుకు వచ్చి ఒక పండుగ వాతావరణం లా ఉంటుంది. ఈ నెలలో వ్రతాలు నోములు గృహప్రవేశాలు పెళ్లిళ్లు వంటివాటితో ఈ నెలంతా ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో నూతన గృహ ప్రవేశాలు సత్యనారాయణ వ్రతాలకు చాలా మంచిది ఇటువంటి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కార్తీకమాసంలో కార్తీక దీపాలను వెలిగించి శివుని అనుగ్రహం పొందుతారు కార్తీక మాసం అంతా తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేసే భక్తిశ్రద్ధలతో ఉపవాసం దీక్ష చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం. ఇక పెళ్ళి విషయానికొస్తే కార్తీక మాసం లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. జనవరి 6 వరకు ముహూర్తాలు ఉన్నప్పటికీ కార్తీక మాసం పవిత్రమైనది కాబట్టి కార్తీక మాసంలో పెళ్లిళ్లు చేయడానికి అందరు ఆరాటపడుతున్నారు.

అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో పుష్యమాసంలో గురు మూడం ఉండటంవల్ల మాఘమాసం మొదలవడంతో కూడా పెళ్లిళ్లు ముహూర్తాలు లేవు, దాదాపుగా పెళ్లిళ్లు చేయడానికి ఆరు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడం వల్ల పెళ్లిళ్లు జరపడానికి కార్తీక మాసంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు