యముడితో చెడుగుడు ఆడుకున్న మన స్టార్ హీరోలు

తెలుగులో డిఫెరెంట్ మూవీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. అందులో ప్రధానంగా యముడి పాత్ర. యముడి పాత్రతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ మదిని దోచాయి. 1963లో దేవాంతకుడు మూవీ ఎన్టీఆర్ హీరోగా వచ్చింది. ఇందులో ఎస్వీ రంగారావు యముడు పాత్ర వేశారు. యముడు కాన్సెప్ట్ తో వచ్చిన తొలిసినిమా ఇది. అప్పట్లో ఈ మూవీ సక్సెస్ ఫుల్ మూవీగా ఇండస్ట్రీలో, ఆడియన్స్ లో పేరుతెచ్చుకుంది.

మళ్ళీ 1977లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమగోల ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. యముడిగా కైకాల సత్యనారాయణ ఫేమస్ అయ్యారు. యమలోకంలో ఎన్టీఆర్ హడావిడి జనాన్ని బాగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక 1988లో యముడి కాన్సెప్ట్ తో చిరంజీవి నటించిన యముడికి మొగుడు మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. ఇందులో యముడిగా సత్యనారాయణ , యమలోకంలో చిరంజీవి నటన హైలెట్.

ఇక 1992లో సుమన్ హీరోగా యముడన్నకి మొగుడు వచ్చినా ఇది సక్సెస్ కాలేదు. 1994లో అలీని హీరోగా పెట్టి ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ అందుకుంది. 1999లో మోహన్ బాబు యమజాతకుడు కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 2007లో యమగోల మళ్ళీ మొదలైంది మూవీ కూడా హిట్ అయింది. అదే ఏడాది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. 2010లో యమలోకం టు బ్రహ్మలోకం నిరాశపరిచింది. 2012లో దరువు ఓ మోస్తరు హిట్ అయింది. అలాగే అల్లరి నరేష్ తో చేసిన యముడికి మొగుడు యావరేజ్ అయింది. 2014లో యమలీల టు తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి కి చేదుజ్ఞాపకాన్ని మిగిల్చింది.