మోహన్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్స్ ఉన్నాయో చూడండి

Mohan Babu Hit Movies :ఎలాంటి పాత్ర వేసిన తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టే మోహన్ బాబు కి తనకంటూ ఓ మేనరిజం తెచ్చుకున్నారు. విలన్ గా ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన మోహన్ బాబు హీరోగా మారి, తన కెరీర్ లో భారీ హిట్స్ అందుకున్నాడు. దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన పాలు నీళ్లు మంచి హిట్ అయింది. మోహన్ బాబు, జయప్రద నటన ఆకట్టుకుంది. మోహన్ బాబు, దివ్యభారతి జంటగా వచ్చిన అసెంబ్లీ రౌడీ మూవీ సోషల్ మెసేజ్ ఇచ్చింది. ఆడియన్స్ లో మంచి పేరుతెచ్చింది. 1992లో వచ్చిన ఈ సినిమాకు మహదేవన్ సంగీతం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ ఆకర్షణ. ఇక రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో వచ్చిన పెదరాయుడు మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో మోహన్ బాబు ద్విపాత్రాభినయంతో చెలరేగిపోయాడు.

కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అల్లుడుగారు మూవీ ఆడియన్స్ కి మంచి వినోదం ,మెసేజ్ కూడా అందించింది. అలాగే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నటసార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా , మోహన్ బాబు నటించి నిర్మించిన మేజర్ చంద్రకాంత్ బిగ్గెస్ట్ హిట్ అయింది. శ్రీరాములయ్య మూవీ కూడా మంచి హిట్ అయింది. హరికృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సౌందర్య, శ్రీహరి తదితరులు నటించారు. మీనా , రమ్యకృష్ణ లతో మోహన్ బాబు కలిసి నటించిన అల్లరి మొగుడు దర్శకేంద్రుని డైరెక్షన్ లో రూపుదిద్దుకుని మంచి హిట్ కొట్టింది.

1991లో వచ్చిన రౌడీగారి పెళ్ళాం మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. శోభన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు విభిన్న పాత్రతో మెప్పించాడు. 1992లో వచ్చిన బ్రహ్మ మూవీ కూడా మంచి పేరు తెచ్చుకుంది. బప్పీలహరి సంగీతం అందించిన ఈసినిమా సాంగ్స్ హిట్. మోహన్ బాబు మరో విభిన్న పాత్రలో అలరించిన మూవీగా అడవిలో అన్న మూవీ నిలుస్తుంది. ఆతర్వాత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన కలెక్టర్ గారు మూవీ కూడా మంచి మెసేజ్ ఇచ్చింది. తర్వాత సోగ్గాడి పెళ్ళాం కూడా బాగానే ఆకట్టుకుంది. 2000లో వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి మూవీ లో మోహన్ బాబు నటన సూపర్ అనిపించుకుంది. సౌందర్యంతో కల్సి నటించిన పోస్ట్ మ్యాన్ మూవీ కూడా బాగా అలరించింది. అల్లరి పోలీస్, చిట్టెమ్మ మొగుడు,కుంతీ పుత్రుడు, ధర్మ పోరాటం మూవీస్ కూడా బాగానే పేరుతెచ్చుకున్నాయి.

error: Content is protected !!