టాలీవుడ్ కమెడియన్స్ చనిపోవడానికి అసలు కారణాలు ఇవే

Telugu Comedians :సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఎంతముఖ్యమో కమెడియన్స్ పాత్ర కూడా అంతేముఖ్యం. మొదటి నుంచి ఎందరో కమెడియన్స్ తమ హాస్యంతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో కమెడియన్స్ కి కొడవలేదన్నట్లు ఉండేది. అయితే మనల్ని నవ్వుల్లో ముంచెత్తిన మంచి మంచి కమెడియన్స్ కొందరిని ఇండస్ట్రీ కోల్పోయింది. ఇందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ను మొదటగా ప్రస్తావించుకోవాలి. నాటక రంగం నుంచి యాడ్స్ అక్కడ నుంచి సినిమా రంగానికి వచ్చారు.

ఒక్కడు సినిమాలో పాస్ పోర్టు గురించి చెప్పే శీను, వర్షం సినిమాలో కొద్దిసేపు ఉన్నా కడుపుబ్బా నవ్వించారు. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ చూస్తుంటే ధర్మవరపు సీన్స్ చూస్తే నవ్వు వచ్చేస్తుంది. ఇక ఏవీఎస్ విషయానికి వస్తే, జర్నలిస్టుగా చేస్తూ సినిమా రంగానికి వచ్చారు. అదో తుత్తి.. అంటూ నవ్వించే పాత్రలే కాదు, గుండె బరువెక్కించే పాత్రల్లో సైతం రాణించిన ఏవీఎస్ మిస్టర్ పెళ్ళాం లో గోపాల్ పాత్ర బాగా రక్తికట్టించారు. రంగు పడుద్ది అంటూ విలనిజం చూపించడమే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా మంచి పాత్రలు వేసి మెప్పించారు.

మిమిక్రి ఆర్టిస్టుగా ఉంటూ కమెడియన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వేణు మాధవ్ యాంకర్ గా, సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టుగా 23ఏళ్ళల్లో650మూవీస్ పైనే చేసాడు. వివి వినాయక్ సినిమాల్లో తప్పనిసరిగా వేణుమాధవ్ కనిపించేవాడు. దిల్ మూవీలో యాక్షన్ కి అవార్డు రాగా, టైగర్ సత్తి క్యారెక్టర్ కి నంది అవార్డు వచ్చింది. నల్లబాలు లాంటి కేరక్టర్స్ అదరగొట్టాడు. లక్ష్మి మూవీలో తెలంగాణ శకుంతలతో కల్సి నటించి నవ్వించిన వేణు,అన్నవరం మూవీలో తెలంగాణ శకుంతల కొడుకుగా చనిపోతూ ఏడిపించాడు. మెగాస్టార్ నుంచి మెగా పవర్ స్టార్, బాలయ్య నుంచి తారక్ వరకూ అందరితో కల్సి నటించాడు.