Healthhealth tips in telugu

మిరియాల పొడి+ఉప్పు+నిమ్మరసం=మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు

Lemon and pepper :ఏదైనా చిన్న అనారోగ్యం వ‌చ్చిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్త‌డం మనకు అలవాటు అయ్యిపోయింది. మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం ఈ రోజుల్లో సాధారణం అయ్యిపోయింది. చిన్న స‌మ‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు వివిధ ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న ఇంట్లో ఉండే న‌ల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గొంతు నొప్పి, మంట‌, ద‌గ్గు…
ఒక టేబుల్ తాజా నిమ్మ‌ర‌సం, అర టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. దీన్ని రోజులో ఎప్ప‌టిక‌ప్పుడు గొంతులో పోసుకుని పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి, మంట, ద‌గ్గు త‌గ్గిపోతాయి.

జ‌లుబుకు…
న‌ల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క‌, జీరా పొడి, యాల‌కుల పొడిల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని అన్నింటినీ క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాస‌న పీలుస్తుంటే జ‌లుబు, ముక్కు దిబ్బడ త‌గ్గిపోతుంది.

గాల్‌స్టోన్స్‌…
మూడు భాగాల ఆలివ్ ఆయిల్‌, 1 భాగం నిమ్మ‌ర‌సం, కొంత న‌ల్ల మిరియాల పొడిల‌ను తీసుకుని మిశ్ర‌మంగా క‌ల‌పాలి. దీన్ని రోజూ సేవిస్తుంటే గాల్ స్టోన్స్ పోతాయి.

బ‌రువు త‌గ్గేందుకు…
ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిల‌ను వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు.

వికారంగా ఉంటే…
ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, 1 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దీన్ని రోజులో వీలైన‌న్ని సార్లు సేవిస్తుంటే క‌డుపులో పుట్టే వికారం త‌గ్గిపోతుంది.

ఆస్త‌మాకు…
ప‌ది న‌ల్ల మిరియాలు, 2 ల‌వంగాలు, 15 తుల‌సి ఆకుల‌ను ఒక క‌ప్పు మ‌రుగుతున్న నీటిలో వేయాలి. అనంత‌రం స్ట‌వ్‌ను 15 నిమిషాల పాటు సిమ్మ‌ర్‌లో ఉంచి నీటిని మ‌ళ్లీ మ‌రిగించాలి. నీరు మ‌ర‌గ‌గా వ‌చ్చిన ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేయాలి. ద్ర‌వం చ‌ల్లారే దాకా ఉండి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 2 వారాల పాటు పాల‌తో సేవించాలి. దీంతో ఆస్త‌మా అదుపులోకి వ‌స్తుంది.

దంతాల నొప్పుల‌కు…
అర టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, కొద్దిగా ల‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దాన్ని నొప్పి పుడుతున్న ప‌న్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే దంతాల నొప్పి త‌గ్గ‌డ‌మే కాకుండా దంతాలు దృఢంగా మారుతాయి.

జ‌లుబు, ఫ్లూ జ్వ‌రానికి…
ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సాన్ని, కొంత తేనెను క‌లిపి తాగుతుంటే జ‌లుబు, సాధారణ ఫ్లూ జ్వ‌రం త‌గ్గిపోతాయి.

ముక్కు నుంచి రక్తం కారుతుంటే…
నిమ్మ‌ర‌సంలో కాట‌న్ బాల్‌ను ముంచి దాన్ని ర‌క్తం కారుతున్న ముక్కు రంధ్రంపై ఉంచితే బ్లీడింగ్ ఆగిపోతుంది.