నెంబర్ వన్ కోడలు సీరియల్ యాక్టర్ తేజ రియల్ లైఫ్ లో ఏమి చేస్తాడో ?

No 1 kodalu serial actor teja :సినిమాలతో సమానంగా టివి సీరియల్స్ కి జనంలో క్రేజ్ ఉంది. పైగా ఇప్పుడు కరోనా కారణంగా సినిమాలు కూడా లేకపోవడంతో సీరియల్స్ కి అతుక్కుపోతున్నారు. జి తెలుగులో సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

ఇక ఈ సీరియల్ లో రాహుల్ కి అన్నయ్య పాత్రలో పాజిటివ్ రోల్ లో నటిస్తున్న తేజ తన అద్భుత నటనతో జనానికి దగ్గరయ్యాడు. హైదరాబాద్ లో నవంబర్ 14న జన్మించిన తేజ అసలు పేరు క్రాంతి. వృత్తి రీత్యా డాక్టర్. ఆయన తండ్రి కూడా డాక్టర్. అయితే నటన మీద మక్కువతో నటనా రంగం వైపు అడుగులు వేసాడు. స్కూల్ ,కాలేజీలలో వివిధ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొని, బహుమతులు గెలిచాడు.

ఇక పేరెంట్స్ సపోర్ట్ తో డాక్టర్ గా వృత్తిని ప్రారంభించి తర్వాత మోడల్ గా ఎంట్రీ ఇచ్చి, పలు తెలుగు తమిళ భాషల్లో యాడ్ ఫిలిమ్స్ లో చేసాడు. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త అనే మూవీలో నటించాడు. ఈటీవీలో ప్రసారమైన మేఘమాల సీరియల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. రామ సీత, మంగమ్మగారి మనవరాలు, ఆడదే ఆధారం, గోరంత దీపం, రాములమ్మ, ప్రతిఘటన , గృహప్రవేశం, వంటి సీరియల్స్ లో చేసి, మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నెంబర్ వన్ కోడలు సీరియల్ తో పాటు స్టార్ మాలో గోరింటాకు సీరియల్ చేస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.