MoviesTollywood news in telugu

టాప్ డైరెక్టర్స్ ఇప్పుడు అంత బిజీగా ఏమి చేస్తున్నారో తెలుసా ?

Telugu directors :గతంలో డైరెక్టర్ అంటే కేవలం సినిమా దర్శకత్వ బాధ్యతలే చూసేవారు. రాను రాను రచన, పాటలు, సంగీతం ఇలా అన్నింటిపై దృష్టిపెడుతూ వచ్చేవారు. ఇక ఇప్పుడు సక్సెస్ ఫుల్ కథలు రాయడమే కాదు, బిజినెస్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇందుకోసం రకరకాల ఫార్ములా ఉపయోగిస్తున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకూ కథ, మాటలు, డైరెక్షన్ మీద దృష్టి సారిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు బిజినెస్ మీద కూడా దృష్టి పెడ్తున్నాడు. ఫ్రైడే మూవీస్ అనే ఏటిటి యాప్ లో ఆయనకు భాగం ఉందని వినిపిస్తోంది. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సుకుమార్ కి కూడా ఇందులో షేర్స్ ఉన్నాయని టాక్.

అందాల రాక్షసి మూవీని సాయి కొర్రపాటి తో కల్సి నిర్మించిన దర్శక ధీరుడు రాజమౌళి ఆ తర్వాత బాహుబలి మూవీతో రెమ్యునరేషన్ తో పాటు బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నట్లు టాక్. డైరెక్టర్ కొరటాల శివ కూడా బిజినెస్ లో షేర్ అడుగుతు న్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ ప్రతి మూవీలో పార్ట్ నర్ అయ్యాడు. ఇక క్రిష్ కూడా వెబ్ సిరీస్ తో దూసుకెళ్తుంటే, ఆయన ఫామిలీ మెంబర్స్ సినిమాలు నిర్మిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."