MoviesTollywood news in telugu

రోజాపై చిరాకు పడిన శ్రీకాంత్…ఎవరికి తెలియని అసలు కారణం ఇదే

Roja And srikanth :టాలీవుడ్ లో పదేళ్ల సమయంలోనే 100 సినిమాలు చేసిన రోజా తెలుగు, తమిళ, కన్నడ అలా ప్రతీ భాషలోనూ ఈమెకు పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. దాంతో పాటు చిన్న హీరోలతో కూడా రొమాన్స్ చేసింది. అందులో భాగంగా టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శ్రీకాంత్‌తో కూడా నటించింది . అప్పట్లో ఈ జోడీ కలిసి నటించిన సినిమాలకు మంచి క్రేజ్ మార్కెట్ కూడా ఉంది. ఇద్దరూ కలిసి నటించిన ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ లాంటి హిట్స్ కూడా వీళ్ళ ఖాతాలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా రోజా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు శ్రీకాంత్. నిజానికి శ్రీకాంత్ కి అప్పట్లో సూపర్ క్రేజ్ ఉండేది. రాశి, రమ్యకృష్ణ, రోజా, సౌందర్య.. ఇలా తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరితోనూ జోడీకట్టి మెప్పించాడు. శ్రీకాంత్ కెరీర్ లో పెళ్ళిసందడి తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా గా ప్రేయసి రావే నిల్చింది. ఈ సినిమాకు ఈ మధ్యే 21 ఏళ్లు పూర్తవ్వడంతో శ్రీకాంత్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ కొన్ని సరదా విశేషాలు షేర్ చేసుకున్నాడు. అప్పట్లో హీరోయిన్స్ అంతా తనకు మంచి స్నేహితులే అని చెప్పాడు.

రామానాయుడు నిర్మించిన ప్రేయసి రావే సినిమా రోజాతో తనకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తావించాడు. చంద్ర మహేష్ తెరకెక్కించైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో తనను రోజా అన్నయ్య అని పిలిచేదని.. తాను కూడా అలాగే చూసేవాడిని అని శ్రీకాంతి చెప్పాడు. అయితే ఒక రోజు షూటింగ్‌లో రొమాంటిక్ సీన్ చేస్తున్నపుడు కూడా అన్నయ్యా ఇలా చేద్దాం.. అన్నయ్య అలా చేద్దామంటూ అనేసరికి సీన్ ముందు అలా అనడం ఆపంటూ ఆమెపై కసురుకున్నట్లు చెప్పాడు. అన్నయ్య అని పిలుస్తుంటే తనకు ఫీల్ రావడం లేదని చిరాకు పడ్డానని శ్రీకాంత్ నవ్వేసాడు. ఇప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులమే అన్నాడు.