సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఎప్పుడో తెలుసా…ఎలాంటి అమ్మాయి కావాలంటే…
Sai dharam Tej marriage :ఈనెల 9న మెగా డాటర్ నిహారిక మేరేజ్ అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని ఉదయ్ ప్యాలెస్ లో జరగ్గా, మళ్ళీ ఇప్పుడు మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మెగా ఫ్యామిలీ నుండి వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పర్చుకున్న హీరోలలో సాయిధరమ్‌తేజ్ వరుస ఫ్లాపులతో ఢీలా పడిన సమయంలో ప్రతిరోజూ పండగే తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి వేగం పుంజుకున్నాడు.
తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’.. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లు పునః ప్రారంభమయ్యాక ప్రేక్షకుల ముందుకొస్తున్న పెద్ద సినిమా ఇదే కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఈ మెగా మేనల్లుడిపైనే దృష్టి సారించింది. ఈసందర్బంగా ఈ మోస్ట్ బ్యాచిలర్ తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు.
ఒక జోక్ వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వితే ఆ ఆనందం వేరని, థియేటర్ అనుభూతి చాలా ప్రత్యేకమైనదని సాయిధరమ్ చెప్పాడు. ఆ అనుభూతి పునః సృష్టించి జోష్ నింపడం కోసం దోహదం చేస్తుందని అన్నాడు. అయితే పెళ్లి గురించి ప్రస్తావిస్తే, నాకు పెళ్లిపై అంత ఆసక్తి లేదు. కానీ మా అమ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అమ్మ ఎప్పుడూ అదే విషయం గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేక మంచి అమ్మాయిని చూడమని చెప్పేశా. ప్రస్తుతం సోలో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నా’ అని సాయిధరమ్ తేజ్ అసలు విషయం బయటపెట్టాడు.