వీరు సాధించిన రికార్డ్స్ ఎప్పటికీ నిలిచి ఉంటాయి…ఎవరు బ్రేక్ చేయలేరు
Tollywood Records : ఇక కింగ్ నాగార్జున కెరీర్ లో శివ మూవీ ట్రెండ్ సెట్టర్. శివ, గీతాంజలి మూవీస్ డబ్బింగ్ తో తమిళనాడులో 175డేస్ ఆడడం మరో రికార్డ్. అన్నమయ్య మూవీ ఆడియో సేల్స్ రికార్డ్ ఎప్పటికి చెరగనిది. విశాఖలో శివ, గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, నువ్వొస్తావనీ మూవీ 100డేస్ కి పైనా ఫుల్ అయ్యాయి. వెంకటేష్ కెరీర్ లో కలిసుందాం రా, రాజా, ప్రేమించుకుందాం రా, నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి, లక్ష్మి .. ఈ 7 సినిమాలు 50సెంటర్స్ కి పైగా వంద రోజులు ఆడిన ఏకైక హీరో గా నిలిచాడు. కలిసుందాం రా మూవీ 76సెంటర్స్ లో 100డేస్ ఆడింది. పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ ఏలూరు లో 154డేస్ కంటిన్యూ హౌస్ ఫుల్స్ అయింది. మొదటి 7సినిమాలు డైరెక్ట్ 100డేస్ ఆడడం ఓ రికార్డ్. దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీస్ తో మొదటి హ్యాట్రిక్ హీరో గా మహేష్ బాబు నిలిచాడు. పోకిరి మూవీ హైదరాబాద్ లో 17సెంటర్స్ లో 100డేస్ ఆడిన సినిమాగా రికార్డ్.
సింగిల్ థియేటర్ లో కోటి రూపాయలు గ్రాస్ సాధించిన మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, సరిలేరు నీకెవ్వరూ ఈ 5సినిమాలున్న ఏకైక హీరో మహేష్ బాబు. ఇక 175డేస్ ఆడిన రికార్డ్స్ క్రియేట్ చేసిన హీరో జూనియర్ ఎన్టీఆర్. సింహాద్రి 175రోజులు 55సెంటర్స్ లో ఆడడం ఓ రికార్డు. బాహుబలితో ఎక్కడ లేని రికార్డ్స్ క్రియేట్ చేసిన హీరో ప్రభాస్. అలాగే 28రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ ఉన్న ఏకైక హీరో. 1050థియేటర్లలో 50డేస్ నడిచి చెరగని రికార్డు కొట్టారు. 20రాష్ట్రాల్లో ఫాన్స్ ఉన్నారు. తన మొదటి 7సినిమాలు డైరెక్ట్ 100డేస్ ఆడడం అల్లు అర్జున్ రికార్డు. రామ్ చరణ్ 213కేంద్రాల్లో 100రోజులు ఆడిన సినిమాగా మగధీర నిల్చింది. సింగిల్ థియేటర్ లో కోటి 68లక్షలు వసూలు చేసిన సినిమా రంగస్థలం. నాగచైతన్య 100%లవ్ ఖమ్మంలో 100డేస్ ఆడేశాక, కొన్ని రోజుల తర్వాత డే థియేటర్ లో రిలీజై 100ఆడింది. ఇక నాలుగు రాష్ట్రాల్లో 365రోజులు ఆడిన ఏకైక చిత్రం శంకరాభరణం.