రకుల్ ఆస్తులు ఎలా కూడబెట్టిందో తెలుసా ?
Telugu Actress Rakul :తెలుగు ఇండస్ట్రీ కొందరికి అచ్చిరాదు, కొందరికి రెడ్ కార్పెట్ లా ఉంటుంది. ఇక కొందరు సైలెంట్ గా వచ్చి, చాపకింద నీరులా ఎదిగిపోయి, స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరతారు. అలాంటివాళ్ళల్లో ప్రధానంగా రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పుకోవాలి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ, పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది. అంతేకాదు, ఆమె సోదరుడిని కూడా సినిమాలలోకి తెచ్చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో రకుల్ ప్లాన్ చూసి, తక్కిన హీరోయిన్స్ షాకవుతున్నారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. చెక్, వైష్ణవ్ తేజ్- క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం, జాన్ అబ్రహంతో ఒకటి, అర్జున్ కపూర్‌తో మరో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బచ్చన్- అజయ్ దేవగణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మేడే చిత్రంలో ముఖ్య పాత్ర వేస్తోంది. ఇవే కాక రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. పలు విజయవంత మైన చిత్రాల్లో కథానాయికగా నటించిన ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది. సినిమాలలో సంపాదించిన సొమ్ముని బిజినెస్‌లో పెట్టి, ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు బిజినెస్‌లతో ముందుకి సాగిపోతోంది.
ఇక ఇటీవల ఈ అమ్మడి పేరు మాదక ద్రవ్యాల కేసులో వినిపించగా తర్వాత నిర్ధోషి అని తేల్చారు. ఇక ఈమె దగ్గర మూడు అత్యంత విలువైన వస్తువులున్నాయని ఆసక్తికర చర్చ జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో దాదాపు 16 వేల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో మూడు కోట్ల విలువ చేసే ఇల్లు కొందట. దీంతో పాటు ఇక్కడ రెండు జిమ్స్ , విశాఖపట్నంలో ఒక జిమ్ వెరసి, మొత్తం మూడు జిమ్స్ రకుల్ పేరు మీదున్నాయి. వీటి విలువ కూడా కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి కొన్ని బిజినెస్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న ఈ అమ్మడు బాగానే కూడబెడుతోంది