MoviesTollywood news in telugu

మెగా,మంచు ఫ్యామిలీస్ మధ్య ఏం జరుగుతోంది…?

Chiranjeevi and Mohan babu :మెగాస్టార్‌ చిరంజీవి, విలక్షణ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు వీరిద్దరూ ఇండస్ట్రీలో చిరకాల మిత్రులే. ఒక్కోసారి ఇద్దరి మధ్యా మాటల తూటాలూ పేలతాయి. సరదా మాటలు నవ్వులు పూయిస్తాయి. ఒక దశలో మెగా ఫ్యామిలీపై కోపంతో రామ్ గోపాల్ వర్మతో మోహన్ బాబు సాన్నిహిత్యం ప్రదర్శించినట్లు గతంలో వార్తలొచ్చాయి.

నిజానికి చిరంజీవిని వాడు వీడు అని సంబోదించిన మోహన్ బాబు ఈ మధ్య గౌరవ సూచకంగా మాట్లాడుతూ వస్తున్నారు. లోపల ఎలా ఉన్నా, పైకి ఆలింగనం చేసుకుని కన్పించడం కూడా అందరికీ తెలుసు. అలాంటిది, చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంటే, ఆ సెట్‌కు మోహన్‌బాబు స్వయంగా వెళ్లి చిరంజీవిని స్నేహపూర్వకంగా కలిశారు.

చిరకాల మిత్రుడు తన సెట్‌కు రావడంతో చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఇద్దరూ కొద్దిసేపు వివిధ అంశాలపై మాట్లాడుకొన్నారు. అంతకు ముందే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా చిరుని కల్సి, ఎందుకు కలిసానో తర్వాత చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టాడు. ప్రస్తుతం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో నటిస్తున్న మోహన్‌బాబు ఇంతకీ చిరుని ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారో మాత్రం బయటకు రాలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."