ఈ సీరియల్ నటిని గుర్తు పట్టారా…ఏమి చేస్తుందో తెలుసా?
Telugu serial actress :ఓ సీరియల్ నటిని నల్లగా ఉన్నందుకు ఏడిపించారట. వివరాల్లోకి వెళ్తే, ఒకప్పుడు జి తెలుగులో వరూధిని పరిణయం సీరియల్ బాగా నడిచింది. మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక హీరోయిన్ రోల్ వేసిన వరూధిని పాత్రధారిణి చందనశెట్టి కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం తమిళంలో దేవయాని సీరియల్ లో ప్రాధ్యాన్యం గల పాత్ర చేసున్న చందనశెట్టి, మాటీవీలో ప్రసారమయ్యే ప్రవిత్ర బంధం లో కూడా చేస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాలేజీ రోజుల్లోనే వరూధిని పరిణయం సీరియల్ లో ఛాన్స్ రావడంతో స్టడీస్ ఆపేసినట్లు ఆమె చెప్పింది.
అయితే అప్పటికి తాను కొంచెం నల్లగా ఉండేదాన్నని ఆమె చెప్పుకొచ్చింది. దాంతో తనను కొందరు హేళన చేశారని, అయితే ఇప్పుడు వాళ్ళ చేత ప్రశంసించ బడటం ఆనందంగా ఉందని, ఏడిపించినవాళ్ళే పొగడడం కన్నా సంతోషం ఏముందని ఆమె చెప్పింది.