Beauty Tips

చలికాలంలో సన్ స్క్రీన్ రాస్తున్నారా…అయితే ఇది మీకోసమే…!

winter Tips :చలికాలంలో చలి విపరీతంగా ఉంది. ఈ కాలంలో చలి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు,చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో చర్మం పొడిగా మారటం చర్మం పగుళ్ళు ఏర్పడటం, రేషేస్ ఏర్పడటం, దురదలు వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా చలికాలంలో చాలామంది మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటారు అప్పటి వరకూ వాడుతూ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ మానేస్తారు. సన్ స్క్రీన్ లోషన్ ఎక్కువగా ఎండాకాలంలో సూర్యుని వేడి నుంచి రక్షణ కోసం వాడుతూ ఉంటారు.

చలికాలం రాగానే సన్ స్క్రీన్ లోషన్ వాడటం మానేస్తారు అయితే నిపుణులు చలి కాలంలో కూడా సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెపుతున్నారు. సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల చర్మం పై ముడతలు సన్నని గీతలు తగ్గడమే కాకుండా చర్మం యవ్వనంగా కనబడుతుంది. సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల చర్మానికి కొల్లజిన్, కెరటిన్ వంటి పోషకాలు అందుతాయి. అంతేకాకుండా దుమ్ము ధూళి మురికి వంటి వాటి నుండి చర్మాన్ని రక్షించే చర్మం ప్రకాశవంతంగా కాంతివంతంగా మెరుస్తుంది. అయితే చర్మతత్వానికి సెట్ అయ్యే సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవాలి