Politics

ఆధార్ కార్డ్ గురుంచి తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు

Aadhar card details :1. ఆధార్ కార్డ్ ఈ రోజు పుట్టిన బేబీ నుంచి ఏ వయసు వారు అయినా నమోదు చేసుకోవచ్చు

2. 5 సంవత్సర లోపు పిల్లలకు వేలి ముద్రలు తీసుకోరు

3. పిల్లలకు కొత్తగా ఆధార్ నమోదుకు బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మరియు తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఉంటే సరిపోతుంది

4. పిల్లలకు 5 మరియు 15 సంవత్సరముల తరువాత తప్పనిసరిగా వేలి ముద్రలు అప్డేట్ చేయించాలి

5. చేతికి వ్రేళ్ళు లేక పోయినా లేదా కళ్లు కనపడక పోయినా మీరు ఆధార్ నమోదుకు చేసుకోవచ్చు

6. ఆధార్ లో వయసు ఒక్క సారి, పేరు లేదా ఇంటి పేరు రెండు సార్లు, చిరునామా ఎన్ని సార్లు అయినా, ఫోన్ నెంబర్ ఎన్ని సార్లు అయినా, ఫొటొ వేలి ముద్రలు ఎన్ని సార్లు అయినా మార్చు చేసుకోవచ్చు

7. పెద్ద వారు కీ ఎటువంటి ప్రూఫ్స్ లేక పోయినా గజెట్ ఫోరం ద్వార ఆధార్ నమోదు చేసుకోవచ్చు

8. డేట్ ఆఫ్ బర్త్ , అడ్రస్ , పేరు మార్చు కొవడానికి తప్పనిసరిగా ఒరిజినల్ ప్రూఫ్స్ తీసుకు వెళ్లాలి

9. ఫోన్ నంబర్ లేదా వేలి ముద్రలు లేదా ఆధార్ లో ఆడ మగ తేడా ఉన్నా తప్పనిసరిగా ఆధార్ నమోదు కెంద్రం వద్ద కి వెల్లాలి

10. ఫొటొ మార్చు కున్నా లేదా అడ్రస్ మార్చు కున్నా మీకు 2 లేదా 3 వారాల లోపు కొత్త ఆధార్ కార్డ్ మీ ఇంటికి పోస్ట్ ద్వార పంపుతారు

11. ఆధార్ INACTIVE, SUSPENDED AND CANCELLED వస్తే మీ దగ్గర లో ఉన్న ఆధార్ నమోదు కెంద్రం వద్ద కి వెల్లి కలవాలి

12. ఆధార్ కార్డ్ ఒకరికి ఒక ఆధార్ కార్డ్ మాత్రమే ఉంటుంది మరొక ఆధార్ కార్డ్ రాదు…ఒక వేల ఆధార్ పొతే దాన్ని ఏదో విధంగా తిరిగి పొందాలీ

13. ఫోన్ నంబర్ లేదా వేలి ముద్రలు అప్డేట్ చేసుకోవడానికీ ఎటు వంటి ప్రూఫ్స్ అవసరం లేదు

14. ఒక ప్రాంత ఆధార్ కార్డ్ మరొక ప్రాంతం లో అయినా తీసుకోవచ్చు లేదా మార్పు లు చేసుకోవచ్చు

15. మీకు ఆధార్ లో వేలి ముద్రలు పడటం లేదు అంటే వేలి ముద్రలు లాక్ అయి ఉన్నాయో తెలుసు కోవాలి

16. ఆధార్ లో మన పేరు ఏ విధంగా అయినా రెండు సార్లు మార్పు చేసుకోవచ్చు

17. ఆదార్ లో తల్లి లేదా తండ్రి లేదా భర్త లేదా గార్డియన్ పేరుని కూడ మార్పు చేసుకోవచ్చు

18. పిల్లలకి కొత్తగా ఆధార్ నమోదుకు తల్లి తండ్రి లేక పోయినా గార్డియన్ ద్వార నమోదు చేసుకోవచ్చు

19. కొత్తగా పెళ్లి అయిన ఆడ వారి ఆధార్ కార్డ్ లో ఇంటి పేరు, భర్త పేరు మరియు భర్త అడ్రస్ మార్పు చేసుకోవచ్చు

20. మీ ఆధార్ కార్డ్ లోనీ డేటా ఎవరికి తెలియకుండ లాక్ కూడ చేసుకోవచ్చు

21. మీ వేలి ముద్రలు నీ కూడ లాక్ చేసుకోవచ్చు

22. చాలా మంది అడుగుతున్నారు వయసు మార్చాలీ అని దానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు లేదా tc లేదా ssc మార్క్ షీట్ లేదా పాస్ పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా employe id card తప్పనిసరిగా ఒరిజినల్ కావాలి….

23. ఆధార్ లో వయసు మార్చడానికి voter id లేదా రేషన్ కార్డు పనికి రావు