MoviesTollywood news in telugu

బన్నీ కోసం విలన్ గా ఒకే చెప్పిన నటుడు…ఎవరో తెలుసా?

pushpa villain :రామ్ చరణ్ తో రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈమూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో సహజంగానే భారీ అంచనాలున్నాయి. పైగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో విడుదలవ్వడంతో బన్నీ ఫాన్స్ చాలా ఆతృతగా ఈ సినిమా కోసం చూస్తున్నారు.

అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ హీరోగా వస్తున్న పుష్ప మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతవరకూ బానే ఉందీ ఇంతకీ ఈ సినిమాలో నటించే విలన్ ఎవరనేది పెద్ద సస్పెన్స్ లా ఉంది.

ముందుగా తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు వినిపించినప్పటికీ ఎందుకో అతడు తప్పుకున్నాడు. అందుకే విలన్ ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. అయితే బన్నీ స్పెషల్ రిక్వెస్ట్ మేరకు పుష్ప సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటిస్తున్నాడని అంటున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో కూడా విలన్ గా ఆర్య కనిపించాడు. అయితే అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."