MoviesTollywood news in telugu

బిగ్ బాస్ లో అరియనా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss Telugu 4 Ariyana :సాధారణంగా బిగ్ బాస్ లో పనిచేస్తే , ఆతర్వాత పెద్దగా ఛాన్స్ లు రావని, పైగా ఉన్నవి కూడా తగ్గిపోతాయని ఇప్పటివరకూ ప్రచారం సాగుతోంది. ఇందుకు ఉదాహరణాలు కూడా చూపిస్తున్నారు. అయితే తాజాగా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 4లో చేసిన అరియనా మాత్రం ఇందుకు భిన్నంగా ఛాన్స్ లు అందిపుచ్చుకుంటోంది.

నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఎన్నాళ్ళో ఉండదని అరియానా గురించి అనుకున్నా బాగానే నెట్టుకొచ్చింది. ఇప్పుడు యాంకర్ ఆఫర్లతో పాటు ఇంకా పలు ఆఫర్లు వస్తున్నాయట. ఏదీ వదులుకోకూడదని, సద్వినియోగం చేస్తుకోవాలని భావిస్తోందట.

బిగ్ బాస్ సీజన్లో టాస్క్ లలో జోరుగా ఉండడం వలన అరియనా విన్ అవుతుందని కూడా ఒక దశలో అందరూ భావించారు. అయితే బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా లేకపోవడం మైనస్ పాయింట్ అయింది. రోజుకి 20వేలు చొప్పున 15వారాలకు 21లక్షలు అందుకున్నట్లు టాక్. అయితే మిగతా కంటెస్టెంట్స్ కన్నా ఇది తక్కువేనని అనుటున్నారు.