కరోనా తర్వాత… కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏమి చెప్పారు
Brahmam Gari Kalagnanam on Coronavirus :భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతారు దేశం ఎంత అభివృద్ధి చెందినా జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా ఎక్కువగా నమ్ముతారు. మన పూర్వీకులు అపర మేధాశక్తితో జరగబోయే విషయాలను ముందే చెప్పేవారు అలాంటి వాటిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒకటి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం లో ఏమి జరుగుతుందో ముందే రాసి పెట్టారు.
సమాజంలో జరిగే మార్పులు వీటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని అంటూ ఉంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం లో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయం పడుతుందని చెప్పారు. ఆ విధంగానే కరోనా సమయం లో వెంకటేశ్వర స్వామి ఆలయం మూతపడింది. ఈ విషయాలన్నీ కరోనా సమయంలో బాగా వైరల్ అయ్యాయి. కరోనా గురించి కూడా బ్రహ్మంగారు ”కోరంకియను జబ్బు కోటిమందికి తగిలి, కోడిలాగ తూగిసచ్చేరయ” అంటూ చెప్పారు.
నూతన సంవత్సరంలో కూడా కరోనా మహమ్మారి తరువాత ఏర్పడిన భయంకరమైన పరిస్థితులు ఆగవని అలాగే కొనసాగుతాయని చెప్పారు. దాని ప్రకారం చూస్తే బ్రిటన్ లో నమోదైన కొత్త స్ట్రెయిన్ వైరస్ స్ప్రెడ్ బాగా జరిగి లాక్ డౌన్ పెట్టారు. ఈ సంవత్సరం కూడా కరోనా నుంచి బయటపడటమే కాకుండా మరో కొత్త వైరస్ తో పోరాటం చేయాలని బ్రహ్మం గారు ముందే చెప్పినట్టు అయింది.

