MoviesTollywood news in telugu

నేనింతే హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress Siya Gautham :ఇండస్ట్రీలోని వాళ్ళ కష్టాలను వాస్తవంగా తెరకెక్కించిన మూవీస్ లో రవితేజ హీరోగా చేసిన నేనింతే సినిమాను ప్రధానంగా చెప్పుకోవాలి. రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తో పోలిస్తే నేనింతే పెద్దగా ఆడలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది ఫాన్స్ ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో, బెస్ట్ సినిమాల లిస్ట్ లో నేనింతే కూడా ఉంటుందని అంటారు.

ముఖ్యంగా రవితేజకు నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన సియా గౌతమ్ కి ఇదే తొలి మూవీ. సియా గౌతమ్ కి అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. అంతేకాదు, అదే ఆమె అసలు పేరట. తన సోషల్ మీడియా అకౌంట్ పేరు కూడా అదితి గౌతమ్ అని ఇప్పటికీ ఉంటుంది.

ప్రస్తుతం ముంబై లో ఉంటున్న సియా గౌతమ్ సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు. నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈమె ఆ తర్వాత 2016 లో 7 ప్రేమ కథలు అనే సినిమాలో నటించింది. సంజయ్ దత్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చిన హిందీ సినిమా సంజు లో సంజయ్ సోదరి ప్రియాదత్ పాత్రలో సియా గౌతమ్ ఒదిగిపొయింది.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."