MoviesTollywood news in telugu

బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు సోహెల్ చేసిన సినిమాలివే

bigg boss sohel :స్టార్ మా ఛానల్ లో రియాల్టీ షో బిగ్ బాస్ షో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తిచేసుకుంది. లేటెస్ట్ గా నాల్గవ సీజన్ కింగ్ నాగార్జున హోస్ట్ గా విజయవంతంగా ముగిసింది. మొత్తం 16మంది కంటెస్టెంట్స్ లో సయ్యద్ సోహెల్ ఒకడు. యురేకా, కోనాపురంలో జరిగిన కథ అనే సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన సోహెల్ అంతకుముందు కొత్త బంగారు లోకం సినిమాలో హీరో చదువుకోడానికి హాస్టల్ కి వెళ్తాడు. అక్కడ హీరో స్నేహితులలో ఒకడిగా మెరిశాడు. అలాగే జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ సినిమాలో హీరో, హీరోయిన్లు కలిసి ఒక టూర్ కి వెళ్తే, వాళ్లతో పాటు వెళ్లినా ఇంకొంత మంది స్నేహితులలో సోహెల్ కూడా ఉన్నాడు. తర్వాత కృష్ణవేణి అనే సీరియల్ లో చేసాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాక చాలా కోపంగా ఉన్నా, ఆ తర్వాత హోస్ట్ నాగార్జున చెప్పడంతో క్రమేపి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. తన హ్యూమర్ తో, ఆడే విధానంతో, హౌస్ మేట్స్ తో కూడా స్నేహంగా ఉంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ టాప్ థర్డ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. మొదటి రెండు మూడు ఎపిసోడ్ల వరకు అరియానా ఇంకా సోహెల్ సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడు తాను అంతకు ముందే కొన్ని సినిమాలు చేశాను అని కూడా చెప్పాడు కూడా.

బిగ్ బాస్ ఫినాలేలో తనకి వచ్చిన మొత్తంలో కొంత మొత్తాన్ని ఆశ్రమానికి ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెబుతూ, మెగాస్టార్ చిరంజీవిని “తన సినిమాకి మద్దతు ఇస్తారా?” అని సోహెల్ అడిగాడు. అందుకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఇవ్వడానికి సిద్ధం అని చిరంజీవి భరోసా ఇచ్చారు. అలాగే బ్రహ్మనందం కూడా రెమ్యూనరేషన్ లేకుండా సోహెల్ సినిమాలో నటించడానికి సిద్ధం అని చెప్పారట. షో నుంచి బయటకు వచ్చిన వెంటనే తన తదుపరి సినిమా కూడా ప్రకటించాడు. ప్రస్తుతం సోహెల్ హీరోగా వచ్చే సినిమాకి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. జార్జ్ రెడ్డి సినిమా నిర్మించిన అప్పి రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా ఉంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."