ఈ నటి చెల్లెలు స్టార్ హీరోయిన్…ఎవరో మీకు తెలుసా ?
Tv Actress Haritha :ముద్దమందారం సీరియల్ జీ తెలుగులో వచ్చేది ఆ సీరియల్లో అఖిలాండేశ్వరి పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న బుల్లితెర నటి హరిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె భర్త జాకీ కూడా సీరియల్ నటుడే. హరిత జాకీ కలిసి ఇద్దరూ కొన్ని సీరియల్స్ లో నటించి అభిమానులను అలరించారు.
అయితే హరిత చెల్లెలు రవళి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. రవళి పెళ్లి సందడి శుభాకాంక్షలు రాముడొచ్చాడు వంటి సినిమాల్లో నటించిన కొంతకాలం తన హవా కొనసాగింది. రవళి అవకాశాలు ఉన్నప్పుడే “నీలి కృష్ణ” అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.అవకాశం వస్తే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టటానికి సిద్దంగా ఉంది.