MoviesTollywood news in telugu

బుజ్జిగాడు హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Bujjigadu Movie Heroine :ఏదైనా సినిమా హిట్ అయితే చాలు ఆ హీరో హీరోయిన్స్ కి ఒక్కసారిగా రేంజ్ మారిపోతుంది. కానీ కొందరు హీరోయిన్స్ హిట్ లేకున్నా ఛాన్స్ లు వస్తున్నాయి. టాలెంట్ ఉంటె ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తాయని బుజ్జిగాడు హీరోయిన్ సంజనా నిరూపిస్తోందని అనుకుంటే, చాలా వివాదాల్లో ఇరుక్కుంది. దాంతో ఎన్నో ఇబ్బందులు కూడా ఫేస్ చేసింది.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు మూవీలో నటించిన ఈమె ఆ సినిమా ఆడకపోయినా, ఇతర హీరోల సరసన నటించే ఛాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళం, కన్నడలో మంచి ఛాన్స్ లు వచ్చాయి. అయితే గత ఏడాది డ్రగ్స్ కేసు కారణంగా ఎన్నో ఆరోపణలు కూడా ఆమెపై వచ్చాయి. క్రికెట్ బెట్టింగ్ లో ప్రముఖంగా ఉందని కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి.

పలువురు రాజకీయ నేతలకు బినామీగా పేరు వినిపించిన సంజనా పై అక్రమాస్తుల కేసు కూడా వచ్చింది. డిసెంబర్ 13న బెయిల్ పై బయటకు వచ్చింది. వివిధ కారణాలతో కావాలనే తనను టార్గెట్ చేసి ఇరికించారని, ఆమె సన్నిహితుల దగ్గర వాపోయింది. కొన్నాళ్ళు రెస్ట్ లోకి వెళ్లి నటిగా బిజీ అవ్వాలని భావిస్తున్నట్టు టాక్. తమిళ సినిమాకు, అలాగే లాక్ డౌన్ లో కొన్ని తెలుగు మూవీస్ కి కమిట్ అయినట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."