బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు
Blockbuster Hit :గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు ఎలాంటి సీన్ కైనా రెడీ అంటున్నారు. ఛేజింగ్, ఫైట్స్, ఇలా ఏదైనా సరే ఒకే చెప్పేస్తున్నారు. తద్వారా ఫాన్స్ లో క్రేజ్ తెచ్చేసుకుంటున్నారు. 200రోజులపాటు వాళ్ళు పడుతున్న శ్రమను రెండు గంటల్లో తేల్చేస్తాం. హిట్ అయితే పర్వాలేదు కానీ, ప్లాప్ అయిందంటే సదరు హీరో పడే బాధను వర్ణించలేం. ఏ సినిమా అయిన హిట్ కొట్టాలనే అనుకుంటారు. కానీ ఒక్కోసారి అంచనాలు రివర్స్ అవుతాయి.
అల్టిమేట్ గా ఆడియన్స్ నిర్ణయాన్ని హీరోలు ఒప్పుకుని తీరాల్సిందే. ఇక కొందరు హీరోలు ఎంతగా కష్టపడుతున్నా , పైగా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, కెరీర్ లో ఒక్క హిట్ కూడా రావడం లేదు. అయినా ఆడియన్స్ ఆదరించకపోతారా అని సినిమాలు చేస్తూనే ఉన్నారు. గౌరవం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లువారి అబ్బాయి కి ఇప్పటి వరకూ హిట్ దక్కలేదు. ఓ పక్క అల్లు అర్జున్ దూసుకుపోతుంటే, శిరీష్ చతికిలబడుతున్నాడు.
అలాగే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రేయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా రిలీజ్ కాలేదు. పిల్లా నువ్వులేని జీవితం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా అనుకున్న రేంజ్ లో పేరు రాలేదు. ప్రొడ్యూసర్ బెల్లకొండ సురేష్ తనయుడిగా బెల్లకొండ శ్రీనివాస్ అల్లుడు శీను మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కష్టపడి సినిమాలు చేస్తున్నా ఇంతవరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆడలేదు. ఇక సాయికుమార్ కొడుకు అది కూడా ప్లాప్ లే చూస్తున్నాడు. నారా రోహిత్, శర్వానంద్, నాగసౌర్య, సందీప్ కిషన్, సుశాంత్ ఇలా చాలామంది యంగ్ హీరోలు పాపం హిట్స్ లేక సతమతమవుతున్నారు.