MoviesTollywood news in telugu

‘చెప్పవే చిరుగాలి’ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

cheppave chirugali movie : ఇండస్ట్రీలోకి చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు. కొందరు తక్కువ సినిమాలు చేసినా తళుక్కున మదిలో మెరుస్తారు. అలాంటి వాళ్ళల్లో అషిమా భల్లా ఒకరు. ఈమె తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అస్సాంలో పుట్టిన ఈమె 2001లో ప్యార్ జిందగీ హై అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తర్వాత డాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి, తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఒక హిందీ సినిమాలో హీరోయిన్ గా, ఇంకొక హిందీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కన్పించింది.

ఇక వేణు తొట్టెంపూడి నటించిన మూవీలో టాప్ మూవీస్ లో ఒకటిగా నిల్చిన ‘ చెప్పవే చిరుగాలి’ మూవీ 2004 లో వచ్చింది. ‘ఉన్నై నినైత్తు’ అనే ఒక తమిళ సినిమాకి రీమేక్. ఇందులో హీరోగా సూర్య నటించారు. అయితే చెప్పవే చిరుగాలి సినిమాలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి గా అషిమా భల్లా మెరిసింది. మెగాస్టార్ చిరంజీవి – వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్, తమిళ సినిమా రమణకి రీమేక్ అని తెలుసు కదా. ఠాగూర్ లో శ్రియ పోషించిన పాత్రని రమణ సినిమాలో అషిమా భల్లా వేసింది. ఒక తమిళ సినిమా, ఒక హిందీ సినిమాలో నటించి, చెప్పవే చిరుగాలి సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.

ఆ తర్వాత ఒక కన్నడ, ఒక హిందీ సినిమాలతో పాటు నాయుడు ఎల్ఎల్బి అనే ఒక తెలుగు సినిమాలో కూడా నటించిన అషిమా భల్లా తర్వాత రెండు తమిళ సినిమాల్లో నటించారు. ఈమె చివరిగా తంబి అర్జున అనే తమిళ సినిమాలో చేసింది. అయితే హిందీలో రెండు సీరియల్స్ లో కూడా నటించారు. అలాగే రెండు రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది. 2018 లో మేరే పాపా హీరో హీరాలాల్ అనే సీరియల్ లో నటించిన అషిమా భల్లా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఈమెకి వివాహం అయినప్పటికి పెళ్ళికి సంబంధించిన వివరాలు లేకున్నా, భర్త తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అక్కట్టుకుంటూ ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."