చెల్లెలి పాత్రలకు ఒకే చెబుతున్న స్టార్ హీరోయిన్స్…కారణం…?

Star heroines :ఒకప్పుడు ఏమోగానీ ఇప్పట్లో హీరోయిన్ అంటే హీరోతో రొమాన్స్ చేయక తప్పదు. ఒకవేళ ఎవరైనా ఒక హీరోను హీరోయిన్.. ‘అన్నయ్యా’ అని పిలిచిందంటే.. ఆమెకు ఇక ఛాన్స్ లు తగ్గిపోయాయన్న భావన. ప్రస్తుతం వెండి తెరపై వెలుగు తున్న స్టార్ హీరోయిన్లు నయన తార, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి ఇప్పుడు సిస్టర్ రోల్స్ వేయడానికి వెనకాడడం లేదు. టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ రేణు దేశాయ్ కూడా పరశురామ్ -మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబుకు వదినగా నటిస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దక్షిణాదిలోనే అగ్ర హీరోయిన్లలో టాప్ రేంజ్ లో ఉన్న నయన తార పలు సినిమాల్లో చేస్తూనే ఉంది. ఈమె స్టార్ డమ్ కి వచ్చిన ఇబ్బంది కూడా లేదు. అయినా సరే , మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రకు ఓకే చెప్పిందట. అవును ‘లూసిఫర్’ రీమేక్ చేస్తున్న చిరు పక్కన నయన తారను చెల్లెలి పాత్రలో ఫిక్స్ చేయాలని డైరెక్టర్ మోహన్ రాజా డిసైడ్ అయ్యారట. అన్నీ ఓకే అయితే.. ‘లూసీఫర్’ రీమేక్ లో మెగాసిస్టర్ గా నయన్ కన్పిస్తోందని చెప్పొచ్చు.

అయితే లూసిఫర్ లో సిస్టర్ పాత్రకోసం సాయి పల్లవి ని సెలెక్ట్ చేయాలనుకుంటే నో చెప్పిందట. ఈ అమ్మడు తనకు నచ్చితేనే చేస్తుంది. నచ్చకపోతే ఎలాంటి రోల్ అయినా వదిలేస్తుంది. అందుకే సెలక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ.. తనదైన స్టైల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే పాన్ ఇండియన్ మూవీ పుష్పలో బన్నీకి చెల్లిలి గా చేయడానికి సాయిపల్లవి ఒకే చెప్పిందట. సుకుమార్ – బన్నీ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ సినిమా నిర్మిస్తోంది.

కాగా ఇటు దక్షిణాదిన అటు ఉత్తరాదిన సినిమాలు చేస్తూ, ఈ మధ్యే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా సిస్టర్ రోల్ కి రెడీ అవుతోందట. దాదాపు 10 ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమాలో కాజల్ ఫస్ట్ టైమ్ సిస్టర్ గా నటించడానికి ఒకే చెప్పినట్లు టాక్. మొత్తానికి పాత్ర బాగుండడం, సొమ్ములు కూడా బాగానే దక్కడం వలన స్టార్ హీరోయిన్స్ ఇలా సిస్టర్ రోల్స్ కి ఒకే చెబుతున్నట్లు టాక్.