Healthhealth tips in telugu

leg swelling :పాదాల వాపు రావటానికి కారణాలు…తీసుకోవలసిన జాగ్రత్తలు

leg swelling treatment in telugu : శారీరక కణజాలాల్లో ద్రవాంశము సంచితమవడం వల్ల వాపు తయారవుతుంది. వాపు వలన శరీరం బరువు పెరుగుతుంది. ఈ లక్షణాలు కాళ్లు, పదాలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఉదరభాగం, నడుము, మోచేతులు, ముఖంలో కుడా వాపు కనిపించవచ్చును.

వాపు మరి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయాసం రావచ్చు. ఉపిరి తిత్తులలో నీరు చేరి ప్రాణవాయువు మార్పిడి అడ్డుకోవడం కుడా జరుగుతుంది. స్త్రీ, పురుషులలో ఇది కనిపించినా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే వాళ్లలో వచ్చే హార్మోణుల హెచ్చుతగ్గుల వల్ల మూత్రపిండాలు శరీరంలోని అదనపు నీటిని, సోడియం అనే పదార్దాన్ని సమర్ధవంతంగా బహిర్గత పర్చలేనప్పుడు వాపు జనిస్తుంది. మూత్రపిండాల వైఫల్యం వంటి వ్యాదులలో ఇలా జరుగుతుంది.

మూత్ర పిండాలు వ్యాధిగ్రస్తమవడం వల్ల రక్తం లోని ప్రోటీన్‌ ముఖ్యంగా ’ఆల్బుమిన్‌’ మూత్రం ద్వార అధికంగా తప్పించుకుని పోతుంది. దాని మూలంగా రక్తంలో ఆల్బుమిన్‌ గణనీయం గా తగ్గిపోయి, రక్తం లోని ద్రవంశం పలుచబడి రక్తనాల గోడలనుంచి నీరు కణజాలం మధ్యకు చేరుతుంది. దీనితో వాపు వస్తుంది.
కారణాలు

గుండె రక్తాన్ని తోడే శక్తిని కోల్పోయినపుడు
కాలేయ వ్యాధులు బాగా ముడురినప్పుడు
శరీరంలో ప్రోటీన్‌ పదార్ధము తగ్గిపోయినపుడు, రక్తహీనత ఉన్నవారిలో.
మూత్ర పిండాలు వ్యాదిగ్రస్తమైనపుడు
కాలేయం వ్యాధిగ్రస్తమైనపుడు (సిర్రోసిస్‌ లివర్‌) – పొట్టలో నీరు చేరుతుంది.
ఊబకాయం ఉన్నవారు ఎక్కువ సమయం నిల్చోని పనిచేస్తే
కాళ్లు వాపులు వస్తాయి(హైపోస్టాటిక్‌ ఎడీమా అంటారు)
రక్తపోటు ఎక్కువగా ఎక్కువకాలము ఉన్నవారిలోనూ కాళ్లు వాపు వస్తుంది.
థైరాయిడ్‌ తక్కువగా పనిచేయడం వల్ల (హైపో థైరాయిడ్‌) శరీమంతా వాపు కనిపిస్తుంది.
బెరి బెరి అనే వ్యాదిలోను శరీరంతా నీరు చేరుతుంది.
ఇద్‌ బి1 విటమిన్‌ లోపము వల్ల వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.