Healthhealth tips in telugu

Gold:నగలు అందానికే కాదు….ఆరోగ్యానికి కూడా … ఎలా?

Health Benefits of Gold :మహిళలు బంగారు నగలు ధరించటంలో అందంతో పాటు ఆరోగ్య పరమైన లాభాలు కూడా ఉన్నాయి.

వడ్డాణము : గర్భకోశము కదలి లోపల ఉన్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.

ముక్కెర : దీన్ని ధరించటం వల్ల మాట్లాడే సమయంలో పై పెదవికి తగిలి వీలు అయినంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కెర ధరించటం వల్ల ముక్కుకొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధాన్యంలో ఒక భాగం. చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది.

కాలికి మెట్టెలు : గర్భకోశంలో నున్న నరాలకూ కాలివేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవడానికి కాలి వేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉంటాయి.

చంద్ర వంక : శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.

మెడకు వేసుకునే హారాలు : హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటం. తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు. గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.