MoviesTollywood news in telugu

సంక్రాంతి రేసులో పక్కా హిట్ కొట్టే సినిమా ఏదో చూడండి

Which Movie Won In Sankranti Race: పండగ వచ్చిందంటే సినిమాల విడుదల సందడి సహజం. అందునా పెద్ద పండగ వస్తే మరీ ఎక్కువ సందడి ఉంటుంది. భారీ సినిమాలే బరిలో ఉంటాయి. గత ఏడాది సంక్రాంతి కి బాగానే వచ్చాయి. ఇక మార్చి నుంచి కరోనా లాక్ డౌన్ వలన ఇన్నాళ్లూ పరిశ్రమ దెబ్బతింది. ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ వేగం అందుకుంది. మరోపక్క థియేటర్లు తెరుస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతికి పోటీలో గట్టి సినిమాలే ఉంటాయని చెప్పొచ్చు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ మూవీ జనవరి 9న థియేటర్లలో సందడి చేసింది. ప్రీరిలీజ్ బిజినెస్ బాగానే అవ్వడంతో 100శాతం సీటింగ్ కెపాసిటీ లేకున్నా బాగానే ఆడింది.

మిగిలిన సినిమాలకు గ్యాప్ ఉండడం, ఈ సినిమాలో విక్రమార్కుని తరహాలలో మీసం మేలెయ్యడం వంటివి ఉండటంతో రవితేజ హిట్ కొట్టాడు . జనవరి 13న మాస్టర్ మూవీ రిలీజ్. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా పక్కా మాస్ లుక్ తో కనిపిస్తోంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. రామ్ పోతినేని నటించిన రెడ్ మూవీ కూడా భారీ ఎత్తున జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. 7భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఫాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాగింది.

అలాగే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ మూవీ రిలీజ్ చేయడానికి జనవరి 15ముహూర్తంగా నిర్ణయించారు. పక్కా మాస్ మసాలాతో ఈ సినిమా ఉండడం వలన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మొత్తం మీదా ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. మంచి కలెక్షన్స్ రాబట్టాయన్న ఆశ కూడా అందరిలో కనిపిస్తోంది. చూద్దాం సంక్రాంతికి సినీ సందడి ఎలా ఉండబోతోందో.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."