MoviesTollywood news in telugu

దేవత సీరియల్ యాక్టర్ దేవుడమ్మ ఎన్ని సినిమాల్లో నటించిందో…?

Devatha serial devudamma : టివి సీరియల్స్ లో పేరుతెచ్చుకున్న సీరియల్స్ దేవత ఒకటి. స్టార్ మా లో ప్రసారమవుతూ బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో నటీనటులు తమ నటనతో అలరిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇక దేవుడమ్మ పాత్రధారి తన పాత్రకు తగ్గట్టు నటిస్తూ అలరిస్తోంది. దేవుడమ్మ రియల్ లైఫ్ లోకి వెళ్తే, ఈమె అసలు పేరు అనిలా శ్రీకుమార్.

కేరళలో కోజికోడ్ లో ఫిబ్రవరి 11న జన్మించిన అనిలా కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం కావడంతో క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. స్టేజ్ షోలు ఇస్తూ మంచి పేరు కూడా తెచ్చకుకుంది. తమిళనాడులో జోడీ నెంబర్ వన్ స్టేజ్ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని ఫైనల్స్ లో ఒకరిగా నిల్చి , డాన్సులతో తమిళ ఆడియన్స్ ని అలరించింది.

మలయాళంలో పలు టివి షోస్, యాడ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనిలా 1992లో స్వర్గం అనే మలయాళం మూవీతో యాక్టింగ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ పేరుతెచ్చుకుని, సీరియల్స్ లో కూడా నటించి పేరు తెచ్చుకుంది. సూర్యపుత్రం,వంశం, దేవి మహత్యం , చిన్న తంబీ, వంటి సీరియల్స్ లో చేసింది. చిన్నతంబి సీరియల్ కి బెస్ట్ మదర్ అవార్డు సొంతం చేసుకుంది. ఓపక్క మలయాళం, తమిళం సీరియల్స్ లో నటిస్తూ తెలుగులో దేవత సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."